BREAKING
బ్రిటన్ వ్యాపార వర్గాలకు భారీ ఊరట కడప గాంధీనగర్ హై స్కూల్ వద్ద నడిరోడ్డుపై తీసిన గుంతలతో ప్రజలు ఇక్కట్లు కడప గాంధీనగర్ ఇజ్రాయెల్ లో ఘోర కాల్పులు కూటమిలో తేలని జెడ్పీటీసీ అభ్యర్థి ..... వైసీపీ, టీడీపీ మధ్య అంతర్గత ఒప్పందాలపై పెదవివిరుస్తున్న కార్యకర్తలు..... గుంటూరు: జనసేన నేతలతో కూటమి మేయర్ అభ్యర్థి భేటీ శివకుమార్ కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సాయం బహుజనులంతా కలసి కట్టుగా ఉండలి గడపగడపకు విస్తృతంగా కూటమి ప్రచారం హైదరాబాద్‌లో దక్షిణాది రాష్ట్రాల డీజీపీల సమన్వయ సదస్సు: ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి తిరుమలలో భక్తుల రద్దీ.. 26 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు ఈవిఎం ల భద్రతకు సంబంధించి ఎటువంటి నిర్లక్ష్యం ఉండకూడదు* *జిల్లా ఎన్నికల అధికారి/జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి నిర్భయంగా నామినేషన్లు వేయండి! ఆర్ ఓ ఎం.లక్ష్మయ్య ఏపీ మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ మార్పు: నవంబర్ 1న పోలింగ్, 3న ఫలితాలు ముష్టూరు ఎంపీటీసీ బరిలో మాలతి : జనసేన తరపున నామినేషన్ దాఖలు కట్టుదిట్టమైన భద్రతా నడుమ మూడవ రోజు నామినేషన్ల ప్రక్రియ!

కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో వైసీపీకి మరో ఎదురుదెబ్బ టీడీపీలో చేరిన 8 కుటుంబాలు.. మద్దతు తెలిపిన మరో 40 కుటుంబాలు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరికలు

Select Suryaa Now
కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో వైసీపీకి మరో ఎదురుదెబ్బ  టీడీపీలో చేరిన 8 కుటుంబాలు.. మద్దతు తెలిపిన మరో 40 కుటుంబాలు  ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరికలు

కళ్యాణదుర్గం ఇన్చార్జ్ (కళ్యాణదుర్గం ఇన్చార్జ్, మేజర్ న్యూస్) : మున్సిపల్ ఎన్నికల వేళ కళ్యాణదుర్గం పట్టణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. పట్టణంలోని 27, 28వ వార్డులకు చెందిన కుమ్మర సామాజిక వర్గానికి చెందిన ఎనిమిది కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరగా, మరో 40 కుటుంబాలు టీడీపీకి మద్దతు ప్రకటించాయి.

స్థానిక కౌన్సిలర్ అభ్యర్థులు పూల వెంకటేషులు, గెల్లి వెంకట కార్తిక్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జయం ఫణి ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి. కళ్యాణదుర్గంలోని ప్రజావేదిక వద్ద ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు సమక్షంలో కుమ్మర సామాజిక వర్గానికి చెందిన తిప్పేస్వామి, తిమ్మరాజు, గురుస్వామి, నంద, కే. సిద్దు, సిద్దరాములు, వెంకటేషులు తదితరులు టీడీపీ కండువాలు కప్పుకుని పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా మరో 40 కుటుంబాలు సైతం తెలుగుదేశం పార్టీకి తమ మద్దతు ప్రకటించాయి. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తామని వారు వెల్లడించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో రోజురోజుకూ వైసీపీని వీడి టీడీపీలో చేరుతున్న వారి సంఖ్య పెరుగుతోందని కూటమి నాయకులు పేర్కొన్నారు. తాజా చేరికలు 27, 28వ వార్డుల్లో పార్టీ అభ్యర్థులకు మరింత బలాన్ని చేకూరుస్తాయని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో చోటుచేసుకుంటున్న ఈ పరిణామాలు స్థానిక రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకున్నాయి.