BREAKING
కూటమిలో తేలని జెడ్పీటీసీ అభ్యర్థి ..... వైసీపీ, టీడీపీ మధ్య అంతర్గత ఒప్పందాలపై పెదవివిరుస్తున్న కార్యకర్తలు..... గుంటూరు: జనసేన నేతలతో కూటమి మేయర్ అభ్యర్థి భేటీ శివకుమార్ కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సాయం బహుజనులంతా కలసి కట్టుగా ఉండలి గడపగడపకు విస్తృతంగా కూటమి ప్రచారం హైదరాబాద్‌లో దక్షిణాది రాష్ట్రాల డీజీపీల సమన్వయ సదస్సు: ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి తిరుమలలో భక్తుల రద్దీ.. 26 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు ఈవిఎం ల భద్రతకు సంబంధించి ఎటువంటి నిర్లక్ష్యం ఉండకూడదు* *జిల్లా ఎన్నికల అధికారి/జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి నిర్భయంగా నామినేషన్లు వేయండి! ఆర్ ఓ ఎం.లక్ష్మయ్య ఏపీ మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ మార్పు: నవంబర్ 1న పోలింగ్, 3న ఫలితాలు ముష్టూరు ఎంపీటీసీ బరిలో మాలతి : జనసేన తరపున నామినేషన్ దాఖలు కట్టుదిట్టమైన భద్రతా నడుమ మూడవ రోజు నామినేషన్ల ప్రక్రియ! ఏపీకి మరో వాయుగుండం ముప్పు: ఆసియా మార్కెట్లలో టెక్ షేర్ల సునామీ: తీవ్రమైన నష్టాల్లో కోస్పి, నిక్కీ.. ఏఐ విలువలు, పెట్టుబడుల రాబడులపై పెరిగిన ఆందోళనలు! సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు, అనవసర ఆందోళనలకు పాల్పడితే కేసులు తప్పవు

ముష్టూరు ఎంపీటీసీ బరిలో మాలతి : జనసేన తరపున నామినేషన్ దాఖలు

Select Suryaa Now
ముష్టూరు ఎంపీటీసీ బరిలో మాలతి : జనసేన తరపున నామినేషన్ దాఖలు

మదనపల్లె,మేజర్ న్యూస్ : మదనపల్లి నియోజకవర్గం,నిమ్మనపల్లె మండలం,ముష్టూరు పంచాయతీ ఎంపీటీసీ స్థానానికి జనసేన పార్టీ అభ్యర్థినిగా మాలతి నామినేషన్ దాఖలు చేశారు.ఈ సందర్భంగా మాలతి,రమేష్ మాట్లాడుతూ తమపై నమ్మకంతో,అభిమానంతో ఆశీస్సులు అందిస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.ప్రజల ఆశీస్సులతో మష్టూరు ఎంపిటిసిగా విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు.అదేవిధంగా తనకు ఎంపిపిగా అవకాశం కల్పిస్తే ముష్టూరు పంచాయతీతో పాటు మండలాన్ని అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు.జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేస్తానని,ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని మాలతి రమేష్ వెల్లడించారు.ఈ కార్యక్రమానికి జనసేన మండల అధ్యక్షుడు ప్రదీప్ సింగ్,తెదేపా సీనియర్ నాయకుడు ఆర్.జె వెంకటేష్,మాజీ వైఎస్ ఎంపిపి రమణ,మాజీ సర్పంచులు,చల్లావారిపల్లి,ముష్టూరు గ్రామ ప్రజలు,మండల వ్యాప్తంగా పెద్ద ఎత్తున మద్దతుదారులు పాల్గొన్నారు.

రిపోర్టర్ : కె.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి