నల్ల బ్యాడ్జీలతో ఆర్టీసీ కార్మికుల నిరసన
విజయనగరం మేజర్ న్యూస్
ఆగస్టు 12న ఆర్టీసీ యాజమాన్యంతో (ఎండి) జరిగిన చర్చల్లో అంగీకరించిన ముఖ్యాంశాలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ (AP PTD) జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపుమేరకు విజయనగరం డిపో వద్ద ఆర్టీసీ కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా జేఏసీ నాయకుడు భానుమూర్తి మాట్లాడుతూ... ఆర్టీసీ జేఏసీ ఒప్పందాలకు విరుద్ధంగా చేపట్టిన 1,450 ఎలక్ట్రిక్ బస్సుల టెండర్ ప్రక్రియను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే మూసివేసిన 4 డిపోలను వెంటనే పునఃప్రారంభించాలని స్పష్టం చేశారు. కార్మికుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం నేడు, రేపు రాష్ట్రంలోని అన్ని డిపోల వద్ద భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు స్వామి, శ్రీను, రాములు, అశోక్, సత్యవతి తదితరులు పాల్గొన్నారు.
శ్రీనివాస్ విజయనగరం