BREAKING
మెట్లకుంటలో ఘనంగా పండగల సాయన్న ముదిరాజ్ 174వ జయంతి వేడుకలు చైనా అక్రమ కార్యకలాపాలపై తైవాన్ ప్రత్యేక దర్యాప్తు అట్టహాసంగా 13వ డివిజన్ టీడీపీ అభ్యర్థి కుర్లపల్లి విజయ్ కుమార్ ఆచారి ఎన్నికల ప్రచారం.. తండ్రి మిత్రుడి కుటుంబానికి అండగా నిలిచిన నీలం ప్రశాంత్ కుమార్-ఆటోడ్రైవర్ ఉప్పలయ్య మృతిపై దిగ్భ్రాంతి-కుటుంబ సభ్యులకు పరామర్శ పదివేల ఆర్థిక సహాయం కడప నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు అరెస్ట్ వివిధ పోలీస్ స్టేషన్లో తరలింపు అమ్మవారి చీర వేలంపాటలో రూ.2 లక్షలకు దక్కించుకున్న శీలం శివారెడ్డి అరిజోనాను వణికించిన అరుదైన పెనుతుపాను: గోల్ఫ్ బంతి పరిమాణంలో వడగళ్ల వర్షం.. తీవ్ర ఆస్తి నష్టం! మిచిగాన్ సెనేట్ చివరి డిబేట్‌లో మాటల యుద్ధం: దేశభక్తి, విధేయతలపై ఎల్-సయ్యద్, మైక్ రోజర్స్ పరస్పర ఆరోపణలు! ఒరెగాన్ స్కూల్ కాల్పుల ఘటన: 'పిల్లలను కాపాడే అవకాశమే లేకపోయింది'.. గాయపడిన ఉపాధ్యాయురాలి భావోద్వేగ ప్రకటన! అంచనాలను మించిన మెటా క్యూ3 ఆదాయం: 'మ్యూజ్' ఖాతాలు కోటి దాటాయన్న మార్క్ జుకర్‌బర్గ్.. ఏఐ వ్యూహం సూపర్ హిట్! ఎన్నికల నిర్వహణపై రాష్ట్రాల హక్కుల పరిరక్షణ: ట్రంప్ యంత్రాంగంపై డెమొక్రాట్ల దావా.. కోర్టులో సవాల్! వాషింగ్టన్ డీసీలో నేషనల్ గార్డ్ కాల్పుల ఘటన: నిందితుడిపై తుపాకీ చట్టాల కింద బహుళ అభియోగాలు నమోదు! ఫ్లోరిడా అమెండ్‌మెంట్ 3పై ‘న్యూస్ 6’ ప్రత్యేక చర్చా వేదిక: ఆస్తి పన్నుల్లో భారీ మినహాయింపులు.. భక్తులకు అసౌకర్యం కలగకుండా పైడితల్లి అమ్మవారి దర్శనం. టెస్లా సరికొత్త ఎగిరే కారుకు ఫ్లోరిడాలో అనుమతిస్తాం: గవర్నర్ రాన్ డిసాంటిస్ సంచలన ప్రకటన!

భవాని భక్తులపై దూసుకెళ్లిన స్కార్పియో! మంత్రి రాంప్రసాద్ దిగ్ర్భాంతి

Select Suryaa Now
భవాని భక్తులపై దూసుకెళ్లిన స్కార్పియో! మంత్రి రాంప్రసాద్ దిగ్ర్భాంతి

భవానీ భక్తులపైకి దూసుకెళ్లిన స్కార్పియో.. నలుగురు దుర్మరణం!

మరో ఇద్దరికి తీవ్ర గాయాలు.. కత్తిపూడి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

ప్రమాదంపై రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి దిగ్భ్రాంతి

సూర్య బ్యూరో, ఉమ్మడి గోదావరి జిల్లాలు:

కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కత్తిపూడి సమీపంలోని రావికంపాడు జంక్షన్ వద్ద భవానీ భక్తులపైకి స్కార్పియో వాహనం దూసుకెళ్లడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. విజయనగరం జిల్లా డెంకాడ నుంచి విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి బయలుదేరిన భక్తులు ఈ ప్రమాదానికి గురయ్యారు.

అందిన సమాచారం ప్రకారం.. డెంకాడకు చెందిన భవానీ భక్తులు ప్రైవేటు బస్సులో విజయవాడకు ప్రయాణమయ్యారు. మార్గమధ్యలో కత్తిపూడి సమీపంలో బస్సు మరమ్మతులకు గురైంది. దీంతో కొందరు భక్తులు టీ తాగేందుకు రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తుండగా స్కార్పియో వాహనం వారిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అమ్మవారి దర్శనానికి వెళ్తున్న భక్తులు మృత్యువాత పడటంతో తీవ్ర విషాదం నెలకొంది.

మంత్రి రాంప్రసాద్ రెడ్డి దిగ్భ్రాంతి

కత్తిపూడి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై రవాణా శాఖ అధికారులతో ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. నలుగురు భవానీ భక్తులు మృతి చెందడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని, అత్యవసర వైద్య సేవలు కల్పించాలని సంబంధిత అధికారులను కోరారు. మృతుల కుటుంబాలకు ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని కనకదుర్గమ్మ ప్రసాదించాలని ఆకాంక్షించారు.