అట్టహాసంగా 13వ డివిజన్ టీడీపీ అభ్యర్థి కుర్లపల్లి విజయ్ కుమార్ ఆచారి ఎన్నికల ప్రచారం..
అనంతపురం నగరపాలక సంస్థ స్థానిక ఎన్నికల సమరం రసవత్తరంగా సాగుతోంది. ఈ ఎన్నికల్లో 13వ డివిజన్ నుండి తెలుగుదేశం పార్టీ (టీడీపీ) తరఫున యువ నాయకుడు, ప్రజానీకానికి ఎప్పుడూ అందుబాటులో ఉండే సౌమ్యుడు కుర్లపల్లి విజయ్ కుమార్ ఆచారి బరిలో నిలిచారు. డివిజన్ అభివృద్ధి ధ్యేయంగా ఆయన చేపడుతున్న ఎన్నికల ప్రచారానికి స్థానిక ప్రజల నుండి అపూర్వ స్పందన లభిస్తోంది.
అందరితో మమేకమవుతూ.. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా!
యువ నాయకుడు విజయ్ కుమార్ ఆచారి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ, డివిజన్లోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వార్డులో ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా తాను స్వయంగా దగ్గరుండి పరిష్కరిస్తానని, డివిజన్ను అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దడమే తన ప్రధాన లక్ష్యమని ఆయన హామీ ఇచ్చారు. యువతకు అండగా ఉంటూ, ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్న విజయ్ కుమార్ ఆచారిని గెలిపించేందుకు డివిజన్ ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు.
నేడు శ్రీ బంగారు రేణుక ఎల్లమ్మ దేవాలయ ప్రాంగణంలో ఆత్మీయ సమావేశం
ఈ ఎన్నికల నేపథ్యంలో 13వ డివిజన్ నందు పోటీ చేస్తున్న మన విశ్వబ్రాహ్మణ సంఘీయుడు, యువకుడు కుర్లపల్లి విజయ్ కుమార్ ఆచారి గారికి నగర విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున సంపూర్ణ మద్దతు ప్రకటించడం జరిగింది.ఈ సందర్భంగా ఈరోజు (గురువారం, అక్టోబర్ 22) సాయంత్రం 6:30 గంటలకు స్థానిక మహల్దారు వీధి నందు గల శ్రీ బంగారు రేణుక ఎల్లమ్మ దేవాలయ ప్రాంగణమునందు ఒక భారీ ఆత్మీయ సమావేశం నిర్వహించబడుతుంది. కావున విశ్వబ్రాహ్మణ సంఘీయులు, మహిళా మండలి సభ్యులు, యువజన సంఘాలు మరియు శ్రేయోభిలాషులందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ సమావేశాన్ని జయప్రదం చేయాలని నగర విశ్వబ్రాహ్మణ సంఘం కోరుతోంది.