BREAKING
చిలకలూరిపేటలో నామినేషన్ల స్వీకరణకు పటిష్ట బందోబస్తు నిబంధనలు ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం: సీఐ రమేష్,ఎస్సై అనిల్ కుమార్ కార్పొరేషన్ ఎన్నికల్లో కోటంరెడ్డి కుటుంబం దూకుడు ప్రభాస్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న బొండా ఉమా వత్సవాయి జడ్పీటీసీ అభ్యర్థిగా కిలారు విశ్వనాథ్ నామినేషన్.. టీడీపీలో గందరగోళం! జిల్లా పరిషత్ చైర్మన్ అభ్యర్థి ఎంపిక విషయంలో చక్రం తిప్పిన వేమిరెడ్డి కుటుంబం.. పుష్కరాల పనులు వేగవంతంగా చేపట్టాలి:..ప్రత్యేక అధికారి హనుమంత రావు. అమరవీరుల త్యాగాలు స్ఫూర్తిదాయకం. రాయితీపై విత్తనాలు.. ప్రత్యామ్నాయ పంటల సాగుకు మొగ్గు చూపాలి.. అక్టోబర్ 24న ఎన్నికల శిక్షణ – స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు ఒకే రోజు నిర్వహించడంపై ఉపాధ్యాయుల్లో గందరగోళం.. నల్లపల్లి విజయ్ భాస్కర్ కరీంనగర్ ఏఎంసీ మార్కెట్‌లో పత్తి కొనుగోళ్లు ప్రారంభం ఇథనాల్ తయారీకి చక్కెరను మళ్లించవద్దు: రాష్ట్రాలకు కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ ఆదేశాలు.. దేశీయ లభ్యత, ధరల నియంత్రణే లక్ష్యం! ట్రంప్-మోదీ 'గ్రాండ్' ట్రేడ్ డీల్: భారత్ ఎక్కువ రాయితీలు ఇస్తోందా? భారత ప్రయోజనాలు, వాణిజ్య సవాళ్ల సమగ్ర విశ్లేషణ! ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ ఎల్ ని నో ప్రభావం... యాసంగిలో ఆరుతడి పంటలే శ్రేయస్కరం... ఇంకెన్నాళ్లీ పారిశ్రామిక ప్రమాదాలు? కార్మికుల ప్రాణాలకు భద్రతేది?

కృష్ణునిపాలెం వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థిగా గెడ్డం అనిల్

Select Suryaa Now
కృష్ణునిపాలెం వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థిగా గెడ్డం అనిల్

గోకవరం, మేజర్ న్యూస్ : గోకవరం మండలం కృష్ణునిపాలెం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ అభ్యర్థిగా గెడ్డం అనిల్ ఖరారయ్యారు. ఆర్ అండ్ ఆర్ కాలనీ, కృష్ణునిపాలెం ప్రాంతాలకు చెందిన వైసీపీ ముఖ్య నాయకులు, ఎస్సీ సామాజిక వర్గ నాయకులు, కార్యకర్తలు,అభిమానులు సమావేశమై చర్చించిన అనంతరం అనిల్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. ఆర్ అండ్ ఆర్ కాలనీలో దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి విగ్రహం వద్ద ఈ సమావేశం నిర్వహించారు. యువకుడిగా, ఉత్సాహవంతుడిగా, పార్టీ పట్ల నిబద్ధత కలిగి ఉండటంతో పాటు ప్రజా సమస్యలపై అవగాహన ఉన్న వ్యక్తిగా గెడ్డం అనిల్ ను గుర్తించి ఎంపీటీసీ అభ్యర్థిగా ఎంపిక చేసినట్లు నాయకులు తెలిపారు.

 అనంతరం దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. పార్టీ నాయకుల సమక్షంలో గెడ్డం అనిల్ కు నామినేషన్ ఫారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా గెడ్డం అనిల్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి ఎంపీటీసీ అభ్యర్థిగా అవకాశం కల్పించిన మండల, స్థానిక వైఎస్సార్సీపీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. 

తాను చిన్నవాడినైనా తనను గుర్తించి ఎన్నికల బరిలో నిలిపినందుకు సంతోషం వ్యక్తం చేశారు. తన సామాజిక వర్గం సంపూర్ణ మద్దతు ప్రకటించడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. తనపై విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరి నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.