నామినేషన్ల పర్వం ప్రారంభం.. వివరాలు వెల్లడించిన రిటర్నింగ్ అధికారి జి. భాస్కర్ రెడ్డి
రావులపాలెం: మేజర్ న్యూస్ మండలంలో ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల పర్వం తొలిరోజు ప్రారంభమైంది. మొదటి రోజు మొత్తం ఐదు నామినేషన్లు దాఖలైనట్లు రిటర్నింగ్ అధికారి జి. భాస్కర్ రెడ్డి తెలిపారు.దేవరపల్లి గ్రామ పరిధిలోని పెంకులపాటి గరువుకు చెందిన గుబ్బల పద్మావతి, కొమరాజులంక గ్రామానికి చెందిన గుర్రాల వెంకట సత్యనారాయణ, అదే గ్రామానికి చెందిన బద్ద పద్మ, బద్ద శిరీష నామినేషన్లు దాఖలు చేశారు.అలాగే వెదిరేశ్వరం గ్రామానికి చెందిన కుడుపూడి పద్మ రెండు సెట్ల నామినేషన్లు సమర్పించినట్లు రిటర్నింగ్ అధికారి వెల్లడించారు.మొదటి రోజు నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా ప్రారంభమైందని, ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా నామినేషన్ల స్వీకరణ కొనసాగుతోందని తెలిపారు.