భూమా అఖిలప్రియ సమక్షంలో తెదేపాలో చేరిక
ఆళ్లగడ్డ మేజర్ న్యూస్ ;
ఆళ్లగడ్డ మండలం చిన్నకందుకూరు గ్రామంలో కొండారెడ్డి కుటుంబ సభ్యులు, ఆయన సోదరులు, బంధువులు, అనుచరులు కలిపి సుమారు 50 కుటుంబాలు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సమక్షంలో గురువారం తిరిగి తెలుగుదేశం పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మాట్లాడుతూ వీరంతా టిడిపిలోకి రావడం చాలా సంతోషంగా ఉంది. వీళ్లంతా మాకు కొత్తవాళ్లు కాదు. మా తల్లిదండ్రులు భూమా నాగిరెడ్డి , శోభమ్మ , పెద్దనాన్న శేఖర్ రెడ్డి సమయంలో కూడా మా కుటుంబంతో కలిసి ప్రయాణం చేసినవాళ్లు అన్నారు.కొన్ని చిన్న చిన్న కారణాల వల్ల మధ్యలో కొంత గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ కొంతకాలం కొనసాగింది. కానీ మా మధ్య ఉన్న అనుబంధం ఎప్పుడూ తెగిపోలేదు. ఈరోజు మళ్లీ అందరూ తమ సొంత గూటికి చేరుకోవడం మాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది అన్నారు.మా మీద నమ్మకంతో తిరిగి వచ్చిన ప్రతి ఒక్కరికీ నేను ఒక భరోసా ఇస్తున్నాను. మీరు మమ్మల్ని నమ్మి మా కుటుంబంలోకి తిరిగి వచ్చారు. మీ నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది. మీకు అన్ని విధాలుగా అండగా ఉండి, మీ కుటుంబ సభ్యురాలిగా మీకు తోడుగా నిలబడతానని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నా అన్నారు. మీరు అమ్మా నాన్న తో ఎలాంటి అనుబంధంతో ఉన్నారో, అంతకంటే ఎక్కువ అనుబంధంతో నాతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాన న్నారు.మా రాజకీయ బలం ఏమిటో, ప్రజల్లో మాకు ఉన్న ఆదరణ ఏమిటో రాబోయే రోజుల్లో మా పనితీరుతో చూపిస్తాం. భూమా నాగిరెడ్డి ప్రజల గుండెల్లో సంపాదించుకున్న స్థానాన్ని ఎవరూ మర్చిపోలేరు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం మా బాధ్యత అని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు.చిన్నకందుకూరు గ్రామంలోనే కాదు, ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో తెలుగుదేశం పార్టీ జెండా మరింత బలంగా ఎగరాలి. అందుకోసం మనమంతా ఐక్యంగా పనిచేయాలి.ఈరోజు తిరిగి మన కుటుంబంలోకి వచ్చిన కొండారెడ్డి గారికి, ఆయన కుటుంబ సభ్యులకు, సోదరులకు, అనుచరులందరికీ మరోసారి హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నానన్నారు.మనది రాజకీయ సంబంధం మాత్రమే కాదు.. తరతరాలుగా కొనసాగుతున్న కుటుంబ అనుబంధం అన్నారు.ఆ అనుబంధాన్ని కాపాడుకుంటూ, భూమా నాగిరెడ్డి చూపించిన మార్గంలో నడుస్తూ, ఆళ్లగడ్డలో తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేయడానికి మనమంతా కలిసికట్టుగా పనిచేద్దాం అని తెలిపిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు.