BREAKING
సామాజిక సేవకు గుర్తింపుగా అందుకున్న అంతర్జాతీయ అవార్డుపై సుమన్ అభినందనలు ఇంకొల్లు మండలంలో ఎమ్మెల్యే ఏలూరి పర్యటన రెండేళ్లలో మొత్తంగా 837 మందికి రూ.7కోట్ల 22 లక్షలు దాటిన ముఖ్యమంత్రి సహాయనిధి సాయం కూకట్‌పల్లిలో గంజాయి కలకలం ట్యునీషియాలో వేగంగా క్షీణిస్తున్న పత్రికా స్వేచ్ఛ...జైలు శిక్షల భయంతో వణుకుతున్న విలేకరులు డిండి ప్రాజెక్టును అడ్డుకోవడం సరికాదు స్పానిష్ ముందస్తు ఎన్నికల సర్వేలో అధికార సోషలిస్టు పార్టీ ఆధిపత్యం రోడ్లపై అక్రమ పార్కింగ్, ఆక్రమణలు తొలగింపు నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు ఎస్ఐ చంద్రకుమార్ ఎంఎల్‌ఏ బావమరిదికి నివాళులు పామూరు ముంగిట్లోకి ‘ఊపాస్‌’ ఎముకల వైద్యం! అభివృద్ధి చెందుతున్న దేశాల రుణ భారతంపై ప్రత్యేక దృష్టి సారించనున్న బ్రిటన్ గంగవరం బీసీ కాలనీలో వర్షపు నీటి సమస్యకు పరిష్కారం కల్తీ నెయ్యి కేసులో ఈడీ సంచలనం పిన్నింటి రమణ కు ముఖ్యమంత్రి సహాయ నిధి అందించిన ఎమ్మెల్యే ఎన్ ఈ ఆర్ బతుకమ్మ సంబరాలతో మార్మోగిన ప్రియదర్శిని కళాశాల ప్రాంగణం

వీర బ్రహ్మంగారి మఠానికి కోట్ల దంపతుల భారీ వితరణ

Select Suryaa Now
వీర బ్రహ్మంగారి మఠానికి కోట్ల దంపతుల భారీ వితరణ

పూసపాటిరేగ, సూర్య : జనసేన సీనియర్ నాయకుడు, కోట్ల  రఘు, అతని సతీమణి అయిన రేవతి దంపతులు వీర బ్రహ్మంగారి మఠానికి భారీ ఆర్థిక సాయం చేసి తన దాతృత్వాన్ని మరోసారి చాటుకున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో ఉన్న పలు దేవాలయాల నిర్మాణాలకు ఆర్థిక సాయం చేసిన కోట్ల దంపతులు అదే స్థాయిలో దేవాలయాలతో పాటు పలు అమ్మవార్ల జాతర ఉత్సవాల్లో కూడా అన్నదాన కార్యక్రమాలను చేస్తూ ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో కోట్ల దంపతులది చెరగని ముద్రగా చెప్పవచ్చును. ఇటీవల కాలంలో పూసపాటిరేగలో వీర బ్రహ్మంగారి జయంతోత్సవాలలో వీర బ్రహ్మంగారి మఠం నిర్మాణానికి తన వంతు ఆర్థిక సాయం గా స్లాబ్ నిర్మాణానికి ఆర్థిక సాయం చేస్తానంటూ జయంతోత్సవాల్లో పాల్గొన్న రఘు విశ్వకర్మ సంఘం నిర్వాహకులకు హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు విశ్వబ్రాహ్మణ సంఘం నిర్వాహకులతో పాటు శైవాంగ పండితులు బ్రహ్మ శ్రీ మణికంఠ శాస్త్రి సమక్షంలో కొవ్వాడలోని తన స్వగృహం వద్ద రఘు తన సతీమణి అయిన రేవతి తో కలిసి అక్షరాల రూ.1.30 లక్షలు అందజేశారు. అంతకుముందు రఘు అందిస్తున్న ఆధ్యాత్మిక సేవలకు గాను వేద పండితుల సమక్షంలో ప్రత్యేక ఆశీర్వాదం చేసి దుస్సాలువాలతో రఘు దంపతులకు ఘనంగా సత్కరించారు. రఘు అందిస్తున్న ఎన్నో ఆర్థిక సేవా కార్యక్రమాలు గాను కోట్ల వంశం దినదినాభివృద్ధి చెందుతుందని రఘు అందిస్తున్న ఆధ్యాత్మికపరమైన సేవా కార్యక్రమాలు చిరస్థాయిగా నిలిచిపోవడమే కాకుండా రఘు ఉన్నత స్థాయిలో నిలిచి సామాన్య ప్రజలకు సేవ చేసే భాగ్యం కలుగుతుందని ఈ సందర్భంగా వేద పండితులు బ్రహ్మశ్రీ మణికంఠ శర్మ ప్రత్యేక ఆశీర్వాదం ద్వారా దీవెనలను అందించారు. ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున విశ్వబ్రాహ్మణ సంఘ నిర్వాహకులతో పాటు మాజీ సర్పంచ్ కోట్ల పరిశినాయుడు కూడా పాల్గొన్నారు.

రిపోర్టర్ : రమేష్, పూసపాటిరేగ, విజయనగరం జిల్లా.