వీఆర్వోలు అందుబాటులో ఉండి సర్టిఫికెట్లకు సహకరించండి...తాసిల్దార్ శ్రీనివాసులు.
తంబళ్లపల్లె మండలంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా పోటీ చేసే అభ్యర్థులకు కావలసిన సర్టిఫికెట్ల కోసం వీఆర్వోలు అందుబాటులో ఉండి సహకరించాలని తాసిల్దార్ శ్రీనివాసులు వీఆర్వోలను ఆదేశించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ఈనెల 21 నుండి నామినేషన్ల కార్యక్రమం ప్రారంభం కానున్నడంతో అభ్యర్థులు కులం, ఆదాయం, నివాస ధ్రువపత్రాలతో పాటు 1బి, అడంగల్, భూముల వివరాల కోసం పరుగులు పెడుతున్నారు. ఈ సమస్యను గుర్తించిన తాసిల్దార్ వెంటనే స్పందించి యుద్ధ ప్రాతిపదికన వీఆర్వోలు సంబంధిత సచివాలయాలలో ఉండి ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల సర్టిఫికెట్ల మంజూరు కు పూర్తిగా సహకరించాలని నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
పి గౌరీ శంకర్ స్టాప్ రిపోర్టర్ తంబళ్లపల్లె అన్నమయ్య జిల్లా