వేదగిరి పై సంతానలక్ష్మి అలంకారం లో భక్తులకు కనువిందు చేసిన ఆదిలక్ష్మి అమ్మవారు
నెల్లూరు రూరల్ మేజర్ న్యూస్ : నెల్లూరు రూరల్ మండలం వేదగిరి క్షేత్రముగా వెలసి ఉన్న వేదగిరి లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం నరసింహకొండపై శరన్నవరాత్రి ఉత్సవలలో భాగముగా ఐదవ రోజు గురు వారం ఆదిలక్ష్మి అమ్మవారి ఉత్సవ మూర్తులకు పంచామృత అభిషేకం మరియు అమ్మవారికి సంతానలక్ష్మి అలంకారం , శ్రీసూక్త హోమములు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉభయకర్తలుగా డా. వేమూరి యుగంధర్ శర్మ,వింధ్య దంపతులు , వేమూరి రేఖాప్రసాద్ శర్మ-అశ్వని దంపతులు, గొల్లపూడి శ్రీనివాస రవికుమార్-నళిని దంపతులు, వల్లెపు చెంచు రామయ్య-సునీత దంపతులు వ్యవహరించారు. దేవి శరన్నవరాత్రులు సందర్భముగా దేవస్థానములో ఈనెల 11 వ తేదినుండి 20 వ తేదీ వరకు శ్రీ ఆది లక్ష్మి అమ్మవారు విశేష అలంకారములలో భక్తులకు దర్శనమిస్తారని చైర్మన్ ఇందుపూరు అచ్యుత శంకర రెడ్డి మరియు కార్యనిర్వహణాధికారి వేమూరి గోపి సంయుక్త ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగముగా ఆరవ రోజు శుక్ర వారము అమ్మవారికి విజయ లక్ష్మి అలంకారం, శ్రీసూక్త హోమములు నిర్వహించనున్నారని వారు తెలిపారు. ఈ కార్యక్రమములో దేవస్థానము కార్యనిర్వహణాధికారి వేమూరి గోపి దంపతులు, ముఖ్య అర్చక స్వాములు అర్చకం మాధవగిరి భాస్కరాచార్యులు, మాధవగిరి వెంకట అప్పలాచార్యులు, మాధవగిరి వెంకట కృష్ణమాచార్యులు, మాధవగిరి లక్ష్మీనరసింహ మూర్తి, అలంకారము స్వామి అంగులూరి రమానాధాచార్యులు, ధర్మకర్తల మండలి సభ్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారిని, అమ్మవారిని దర్శించి, తీర్థ, అన్న ప్రసాదములు స్వీకరించారు. అలాగే శరన్నవరాత్రి వేడుకలకు భక్తులందరినీ ఆహ్వానించారు.