BREAKING
వైయస్సార్ పార్టీ పేటేరు ఎంపీటీసీగా రెబ్బ నాగమణి నామినేషన్ నార్లాపూర్‌లో అభివృద్ధి పనులు శరవేగం పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు పేదలకు సీఎం సహాయనిధి అండ. రొంపిచర్లలో గొడవలకు దిగితే కఠిన చర్యలు! ఏఎస్పీ హనుమంతరావు *సంగారెడ్డి జిల్లా టీఎన్జీవోస్ నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక* ప్రచారంలో దూసుకుపోతున్న 25వ కౌన్సిలర్ అభ్యర్థి పంతగాని ప్రేమలత మాబుసుభాని గ్యార్మీ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, చైర్మన్ అభ్యర్థి బుట్నా లక్ష్మి మ‌ల్లారెడ్డిపేటలో ఘ‌నంగా బ‌తుక‌మ్మ వేడుక‌లు మల్కాపూర్‌లో ఘనంగా స్వేరోస్ డే వేడుకలు పేటేరు గ్రామంలో పొలంబడి కార్యక్రమం పేదల ఆకలి తీర్చిన పోరాటయోధుడు పండుగ సాయన్న బాబా పిలుపుతో పుస్తకావిష్కరణ ఒక్క ఓటు మిస్ కావద్దు... మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు *అల్లం పంటలో కొత్త తెగులు.. కేంద్ర బృందం క్షేత్రస్థాయి పరిశీలన!*

వైసిపి ఎంపీపీ అభ్యర్థిగా "కేతిరెడ్డి శిరీష"

Select Suryaa Now
వైసిపి ఎంపీపీ అభ్యర్థిగా "కేతిరెడ్డి శిరీష"

గరుగుబిల్లి, సూర్య : స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎంపీపీ అభ్యర్థిగా నాగూరు గ్రామానికి చెందిన కేతిరెడ్డి శిరీషను ప్రకటించారు.ఈమేరకు గరుగుబిల్లి మండలానికి సంబంధించి చినమేరంగి క్యాంపు కార్యాలయంలో ఎంపీటీసీ స్థానాలకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులను కురుపాం నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు మరియు మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి ప్రకటించారు.అదే విధముగా నాగూరు ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కేతిరెడ్డి శిరీషను ఎంపీపీ అభ్యర్థిగా  ప్రకటించడం జరిగింది.ఎంపీపీ అభ్యర్థిగా ప్రకటించిన కేతిరెడ్డి శిరీష విద్యావంతురాలు.అదే విధంగా నాగూరు గ్రామపంచాయతీ సర్పంచ్ గా పనిచేశారు.మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ కేతిరెడ్డి అచ్యుత రావు సతీమణి కేతిరెడ్డి శిరీషకు ఎంపీపీ అభ్యర్థిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటూ ప్రకటించడం జరిగింది.నాగూరు ఎంపీటీసీ అభ్యర్థిగా అదే విధంగా ఎంపీపీ అభ్యర్థిగా ప్రకటించడం పట్ల మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు పాముల పుష్ప శ్రీవాణి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శత్రుచర్ల పరీక్షిత్ రాజు, ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ మరిశర్ల బాపూజీనాయుడు తోపాటు పలువురు నాయకులకు కేతిరెడ్డి శిరీష కృతజ్ఞతలు తెలిపారు.

రిపోర్టర్ : శశి భూషణరావు, గరుగుబిల్లి, పార్వతిపురం మన్యం.