వైసిపి అభ్యర్థి నామినేషన్ తిరస్కరణ పై ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి అభ్యంతరం
నెల్లూరు, కార్పొరేషన్, మేజర్ న్యూస్ : నెల్లూరు వెంకటేశ్వరపురం భగత్ సింగ్ కాలనీ నామినేషన్ సెంటర్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 72వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి సఫియా బేగం నామినేషన్ తిరస్కరణకు అధికార పార్టీ కుట్ర చేసిందని ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు. సోమవారం ఆయన వైసీపీ అభ్యర్థితో పాటు పోలింగ్ కేంద్రానికి చేరుకొని ఎన్నికల అధికారులను ప్రశ్నించారు.
నామినేషన్ విషయంలో అధికార పార్టీ చేస్తున్న కుట్రలకు.. అధికారులు తొత్తులుగా మారి.. నిబంధనలను తుంగలో తొక్కుతున్నారని ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ధ్వజమెత్తారు.
కార్పొరేషన్ చెందిన కమ్యూనిటీ హాల్.. విషయంలో సఫియా బేగం లబ్ది పొందారంటూతప్పుడు ఆరోపణ చేస్తూ ఇది ఆఫిడివిట్ లో పేర్కొనలేదంటూ నామినేషన్ తిరస్కరణ చేయటమేటని ప్రశ్నించారు.
మున్సిపాలిటీ ఇచ్చిన.. నో డ్యూస్ లో కమ్యూనిటీ హాల్ విషయం పేర్కొనకుండా నామినేషన్ స్క్రూట్ ని సమయంలో కమ్యూనిటీ హాల్ విషయాన్ని తీసుకువచ్చి అభ్యర్థి నామినేషన్ విషయంలో అధికారులు హై డ్రామాచేస్తున్నారని ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మండిపడ్డారు . ఎటువంటి ఎవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆ ప్రాంతానికి నగర డి.ఎస్.పి దీక్ష చేరుకొని పర్యవేక్షించారు.