వైసీపీకి భారీ షాక్... టిడిపిలో భారీగా చేరిన మహిళలు
ఆత్మకూర్, మేజర్ న్యూస్ : స్థానిక సంస్థల ఎన్నికలవేళ వైసీపీ పార్టీకి శ్రీశైలం నియోజకవర్గం లో భారీ షాక్ తగిలింది. సోమవారం వైసీపీ పార్టీని వీడి ఆత్మకూర్ పట్టణానికి చెందిన వైసిపి మహిళ నాయకురాలు పరిమళ ఆధ్వర్యంలో2500 మంది మహిళలు టిడిపిలో చేరగా పార్టీ కండువాలతో శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి పార్టీ కండువాలతో సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుడ్డా మాట్లాడుతూ మహిళ సంక్షేమ అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందని అన్నారు. మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం పొదుపు సంఘాలను టిడిపి ప్రభుత్వం హయాంలోనే ఏర్పాటు చేశామనేది గుర్తుంచుకోవాలన్నారు. నేడు కుటుంబ ప్రభుత్వం మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ప్రతి ఒక్కరికి అందిస్తుందని అన్నారు. మహిళకు తెలుగుదేశం పార్టీ అండగా నిలిచి ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందిస్తామని అన్నారు. పెన్షన్లు రానివారు ఉంటే తన దృష్టికి తేవాలని ఒంటరి మహిళలకు సంబంధించిన సర్టిఫికెట్ల కోసం ప్రత్యేక లాయర్ ను ఏర్పాటు చేసి న్యాయం చేస్తామని అన్నారు. మహిళా సంక్షేమమే కూటమి ప్రభుత్వ అధ్యాయమని అభివృద్ధి చేసే ప్రభుత్వాన్ని నాయకులను గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు, అధిక సంఖ్యల మహిళలు పాల్గొన్నారు.