వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకులతో మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్ ఆత్మీయ భేటీ
అనంతపురం బ్యూరో (అనంతపురం బ్యూరో, మేజర్ న్యూస్ : అనంతపురం నగరపాలక సంస్థ మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు సీనియర్ నాయకులను మర్యాదపూర్వకంగా కలిసి ఆత్మీయంగా పలకరించారు. మాజీ ఎంపీపీ వీరారెడ్డి, మాజీ ఏపీఎస్‌ఐడీసీ రాష్ట్ర చైర్మన్ నల్లపరెడ్డి, మాజీ జెడ్పీటీసీ సుబ్బారెడ్డిలను ఆయన కలిసి మాట్లాడారు.
ఈ సందర్భంగా నగర రాజకీయ పరిస్థితులు, రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు, నగర అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై చర్చించినట్లు సమాచారం. పార్టీ బలోపేతం, నాయకులు, కార్యకర్తల సమన్వయంతో ఎన్నికల్లో విజయానికి కృషి చేయడం వంటి అంశాలు ఈ భేటీలో ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
సీనియర్ నాయకులతో రమేష్ గౌడ్ భేటీ కావడం అనంతపురం నగర వైఎస్సార్‌సీపీలో రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీ నాయకుల మధ్య ఆత్మీయ సంబంధాలు, సమన్వయాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా ఈ సమావేశం సాగింది.