BREAKING
రాజరాజేశ్వరి దేవిక దర్శనమిచ్చిన గ్రామ దేవత శ్రీ పైడమ్మ అమ్మవారు శిక్షణ కార్యక్రమాలు 85వ డివిజన్‌లో టీడీపీ అభ్యర్థి గెలుపునకు బొండా ఉమా ప్రచారం హింసాత్మక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు. ఖమ్మంలో జమ్మిబండపై ప్రత్యక్షమైన స్తంభాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న జిల్లా కలెక్టర్ సత్తుపల్లిలో ఆధునిక వైద్య సేవలకు మరో ముందడుగు.. ‘శస్త్ర హాస్పిటల్’ ప్రారంభం*మంత్రి తుమ్మల ఎమ్మెల్యేమట్టా రాగమయి దయానంద్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం మండల పరిధి పుల్లపాడు MPTC అభ్యర్థిగా మురాల ఫణికుమార్ వైసీపీకి షాక్ - టీడీపీలో చేరిన మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ స్వగ్రామంలో సీఎం రేవంత్‌రెడ్డి దసరా వేడుకలు: కోట మైసమ్మ అమ్మవారికి, జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు శ్యామల బేకరీ ని ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు సమక్షంలో వైసీపీలో చేరిక పాలకొండ ఏరియా ఆసుపత్రిలో నూతన హంగులు మాజీ మంత్రి పువ్వాడ దసరా వేడుకలు డెహ్రాడూన్‌లో దసరా వేడుకల్లో పాల్గొన్న ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి. దసరా పండుగ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి

స్థానిక రాజకీయ సమరంలో మూడుముక్కలాట

Select Suryaa Now
స్థానిక రాజకీయ సమరంలో మూడుముక్కలాట

పూసపాటిరేగ, సూర్య : మండల అధ్యక్ష సారధి తో పాటు జడ్పిటిసి స్థానంపై కూటమి ఇరు పార్టీల నాయకులతో పాటు వైకాపాలో కూడా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. వైకాపాలో అధ్యక్ష పీఠం పోటీపై పతివాడ అప్పలనాయుడు పేరు అధికారికంగా ఖరారు అయినప్పటికీ జడ్పిటిసి స్థానం పై సందిగ్ధత వీడ లేదు. జడ్పిటిసి విషయంలో బొత్స లక్ష్మణరావు కుమారుడైన చైతన్య పోటీ చేస్తారా లేక అతని కాయని పక్షంలో మండలంలోని తెలగా సామాజిక వర్గం ఎవరైనా పోటీ చేస్తారా అన్నది సందిగ్ధంగా మారింది. అయితే ఎంపీపీ రేస్ లో ఉన్న వైకాపా మండల అధ్యక్షుడు పతివాడ అప్పలనాయుడు కూడా ఎంపీటీసీ స్థానాల విషయంలో రెబల్ అభ్యర్థుల తలనొప్పులు తప్పడం లేదు. గత నుంచి వారికి ఎప్పుడు ఎంపీటీసీ స్థానం ఎంపిక చేసుకుంటూ వస్తున్నారు. ఇదే స్థానంపై పోటీ చేసిన తన కుమార్తె కళ్యాణి ఎంపీటీసీగా గెలిచి ఎంపీపీ స్థానం కూడా అధిరోహించారు. తాజాగా ఇదే స్థానంపై ఎంపీటీసీ స్థానంపై పోటీ చేస్తారా లేక వారి కుటుంబ సభ్యులకు ఈ స్థానాన్ని పోటీ చేయించే అవకాశం ఉంటుందా అన్నది భిన్నభిప్రాయాల వ్యక్తం అవుతున్నాయి. పసుపం ఎంపీటీసీ స్థానంపై ఇదే సిగ్నెంట్ పరిధిలో ఉన్న మర్రిపేట గ్రామానికి చెందిన మధుబాబు పోటీ చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. తనకు వైకాపా నుంచి అవకాశం  రాకుంటే స్వతంత్ర అభ్యర్థి బరిలో పోటీ చేసి తన సత్తా చూపుతానంటూ తన మనసులో ఉన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక కూటమి విషయంలో ఎంపీపీ, జడ్పిటిసి సారధుల ఎంపికలో ఎవరికి కేటాయించాలన్నది ఇప్పటికీ తేలక పోవడంతో ఇరు పార్టీల అధిష్టాన నాయకులకు తలనొప్పిగా మారింది. కూటమి ప్రభుత్వంలో జనసేన నుంచి ఎంపీపీ అభ్యర్థిగా కోట్ల రఘు తాను చేసే సేవా కార్యక్రమాలు, మండలంలో ఉన్న ప్రజలకు అవడంలో జనసేన తరుపున తనకే ఎంపీపీ సీటు ఖరారు అవుతుందని రఘు ధీమా వ్యక్తం చేస్తుండగా, తెదేపా పార్టీలో మాజీ మంత్రి పతివాడ నారాయణస్వామి నాయుడు కుమారుడు తమ్మి నాయుడు అదే స్థాయిలో ఎంపీపీ సీటు కోసం ముమ్మర ప్రయత్నాలలో సాగిస్తూనే ఉన్నారు. జడ్పిటిసి స్థానం కూడా రెల్లివలకు చెందిన మాజీ ఎంపీపీ మహంతి చిన్న నాయుడు కూడా ప్రయత్నాలలో కొనసాగిస్తూనే ఉన్నారు. అయితే తెదేపాకు చెందిన నాయకులు ఎంపీపీ తో పాటు జడ్పిటిసి స్థానాలను కూడా రెల్లివలస కు చెందిన వారే పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేయడంపై తీవ్ర విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఒకే గ్రామానికి చెందినవారు ఎంపీపీ తో పాటు జడ్పిటిసి స్థానాలను కోరుకోవడం తీవ్ర తప్పిదంగా భావిస్తూ ఇప్పటికే తెదేపాకు చెందిన పసుపులేటి గోపి తో పాటు అతని సోదరుడు మాజీ సర్పంచ్ పసుపులేటి శ్రీనివాసరావు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు జడ్పిటిసి స్థానంపై తెదేపా నాయకులు గత రెండుసార్లు ఇస్తామని మోసం చేశారని, ఈసారి కూడా తనకు అన్యాయం జరిగితే స్వతంత్ర అభ్యర్థిగా జడ్పిటిసి కి పోటీ చేసేందుకు తగ్గేది లేదని గోపి తన నిర్ణయాన్ని బహిరంగంగానే వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంలో ఒకవైపు అభ్యర్థుల ఎంపిక బెడద, త్రి పార్టీలోను కూడా జడ్పిటిసి స్థానంపై ఇటి తేల్చకపోవడంతో ఆశావాహు లకు పార్టీలు ఎవరిని ఎంపిక చేస్తుందో వేచి చూడాలి మరి.

 

 

రిపోర్టర్ : రమేష్, పూసపాటిరేగ, విజయనగరం జిల్లా.