నెల్లుట్ల గ్రామ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు-సర్పంచ్ నర్సింగ రామకృష్ణ
లింగాలఘణపూర్ , మేజర్ న్యూస్, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే విజయదశమి (దసరా) పండుగను నెల్లుట్ల గ్రామ ప్రజలందరూ ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని గ్రామ సర్పంచ్ నర్సింగ రామకృష్ణ ఆకాంక్షించారు. దసరా పండుగను పురస్కరించుకొని సోమవారం ఆయన పాలకవర్గ సభ్యులతో కలిసి గ్రామ ప్రజలకు, రైతులకు, యువతకు మరియు మహిళలకు హృదయపూర్వక దసరా శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా సర్పంచ్ నర్సింగ రామకృష్ణ మాట్లాడుతూ జగన్మాత కనకదుర్గమ్మ ఆశీస్సులతో గ్రామంలోని ప్రతి ఇంటా సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, సిరిసంపదలు వెల్లివిరియాలని కోరుకున్నారు. పండుగ పూట ప్రజలందరూ సోదరభావంతో, ఐక్యమత్యంతో ఉంటూ సంప్రదాయబద్ధంగా వేడుకలు జరుపుకోవాలని సూచించారు. గ్రామ అభివృద్ధిలో ప్రజలందరూ భాగస్వాములై, నెల్లుట్ల గ్రామాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు తమ పాలకవర్గం నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్, వార్డు సభ్యులు మరియు గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్, కార్తీక్, లింగాల ఘనపూర్, జనగామ జిల్లా.