BREAKING
అనవరంలో వైసీపీలోకి 50 కుటుంబాలు! అభ్యర్థులు ఎంపికలో వైసీపీ, తేదేపా నేతలు కసరత్తు దసరా శుభాకాంక్షలు తెలిపిన నాయకులు మురారి చింతల-దొరికిల్లు కొండపై ఘనంగా విత్తనాలు నాటే కార్యక్రమం-పర్యావరణ పరిరక్షణకు నాంది స్థానిక రాజకీయ సమరంలో మూడుముక్కలాట 33 వ వార్డు వైసిపి కౌన్సిలర్ అభ్యర్థి పై దాడి ఎన్నికల నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలి జడ్పీటీసీ బరిలోకి ఎన్ని శ్రీనివాసరావు...!! విధుల్లోనే మృతి చెందిన గ్రామ పంచాయతీ కార్మికుడు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు: డీఎస్పీ రమణారావు పండుగ సాయన్న జయంతి పోస్టర్ ఆవిష్కరణ ఉత్తరాంధ్ర అరుదైన కళాకారిణి జీవిత కథ ఆధారంగా ప్రేక్షకుల ముందుకు 'గరివిడి లక్ష్మి'! రాజీవ్ గాంధీకి ఘన నివాళులు పరకాల శివాలయాన్ని దర్శించుకున్న రైతు రుణ విమోచన కమిషన్ మాజీ చైర్మన్ నాగూర్ల వెంకన్న చైన్ స్నాచర్ల ముఠా అరెస్టు -13 దోపిడీలలో 57 లక్షల 352 గ్రాముల బంగారు స్వాధీనం

ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులను వెంటనే క్రమబద్ధీకరించాలి

Select Suryaa Now
ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులను వెంటనే క్రమబద్ధీకరించాలి

మంచిర్యాల టౌన్ : జాతీయ ఆరోగ్య మిషన్‌ ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే క్రమబద్ధీకరించాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి డిమాండ్ చేశారు.తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని కోరుతూ మంచిర్యాల జిల్లా కలెక్టరేట్‌ ఎదుట దీక్ష చేస్తున్న జాతీయ ఆరోగ్య మిషన్‌ ఉద్యోగులకు ఆయన సంఘీభావం తెలిపారు.ఈ సందర్భంగా రఘునాథ్ వెరబెల్లి మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రభుత్వం జాతీయ ఆరోగ్య మిషన్‌ ఉద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు వారిని వెంటనే క్రమబద్ధీకరించాలని కోరారు. ఉద్యోగులు చేస్తున్న దీక్షకు భారతీయ జనతా పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని, వారి పోరాటానికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.కేంద్ర ప్రభుత్వం తన వాటా నిధులను సకాలంలో విడుదల చేస్తున్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులను చెల్లించడంలో జాప్యం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ప్రజలకు వైద్య సేవలు అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్న జాతీయ ఆరోగ్య మిషన్‌ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు.ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, వారి సేవలను గుర్తించి తక్షణమే క్రమబద్ధీకరణ ప్రక్రియ చేపట్టాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో  సత్యనారాయణ, కుర్రె చక్రి, అమిరిశెట్టి రాజ్‌కుమార్, పల్లి రాకేష్, ఈర్ల సదానందం తదితరులు పాల్గొన్నారు.