పొన్నూరులో ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణపై రాజకీయ పార్టీలతో సమావేశం
పొన్నూరు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో రిటర్నింగ్ అధికారి వి. విజయలక్ష్మి సోమవారం సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి తహసిల్దార్ , మండల పరిషత్ అభివృద్ధి అధికారి సీఐ ఆర్ యస్ కిషోర్ కుమార్ హాజరయ్యారు.ఈ సందర్భంగా రిటర్నింగ్ అధికారి విజయలక్ష్మి మాట్లాడుతూ... నామినేషన్ల దాఖలు, పరిశీలన ఉపసంహరణకు సంబంధించిన విధివిధానాలను వివరించారు. నామినేషన్ పత్రాలను నిర్దేశిత నమూనాలో అవసరమైన ధ్రువపత్రాలతో నిర్ణీత గడువులోగా సమర్పించాలని సూచించారు.డిపాజిట్ మొత్తం అభ్యర్థుల అర్హతలు ఓటరు జాబితాలో పేరునమోదుప్రతిపాదకునికిఉండవలసిన అర్హతలు ఎంపీటీసీ స్థానాల వారీగా అమలులో ఉన్న రిజర్వేషన్లపై అవగాహన కల్పించారు.ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎంసీసీ ) ని తూచా తప్పకుండా పాటించాలని స్పష్టం చేశారు. అలాగే ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రం, స్ట్రాంగ్ రూమ్, ఓట్ల లెక్కింపు కేంద్రాల ఏర్పాట్లపై వివరించారు. ప్రచార సభలు ర్యాలీలు వాహనాలు మైకుల వినియోగానికి ముందస్తు అనుమతులు తప్పనిసరని ఓటర్లను నగదు బహుమతులతో ప్రలోభపెట్టరాదని హెచ్చరించారు.అక్రమ నగదు తరలింపు ప్రలోభాలను అరికట్టేందుకు ఫ్లయింగ్ స్క్వాడ్ స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్ ల తనిఖీలు ఉంటాయని నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు .
అభ్యర్థులు నిర్దేశిత ఎన్నికల వ్యయ పరిమితిని పాటించాలని ప్రచార ఖర్చులను సక్రమంగా నమోదు చేసి అధికారులకు సమర్పించాలన్నారు.ఎన్నికలను స్వేచ్ఛాయుతంగా పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని పార్టీలు అభ్యర్థులు సహకరించాలని కోరారు.
పొన్నూరు నేటి దినపత్రిక సూర్య రిపోర్టర్ :- శిలార్