ఎంపీటీసీ ఎన్నికలకు 21 నుండి నామినేషన్లు - ఎంపీడీవో జవహర్ బాబు
దువ్వూరు, మేజర్ న్యూస్ :స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా ఈనెల 21వ తేదీ నుండి 23వ తేదీ వరకు ఎంపీడీవో కార్యాలయంలో ఉద యం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఎంపీటీసీ ఎన్నికలకు నామినేషన్లు స్వీకరణ జరుగుతుందని అసిస్టెంట్ ఎన్నికల అధికారి, ఎంపీడీఓ జవహర్ బాబుసోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేపటినుంచి, అనగా21 తేదీ నుంచి 23 తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ కార్యక్రమంలో జరుగుతుందని, 24వ తేదీ నామినేషన్ల పరిశీలన, 25వ తేదీన నామినేషన్ ఫారంలో ఏమైనా తప్పిదాలు జరిగి తిరస్కరించిన నామినేషన్లపై అప్పిలు చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. 26వ తేదీ ఎన్నికల అధికారి తిరస్కరణ నామినేషన్ల పై తుది నిర్ణయం తీసుకుంటారని 27వ తేదీ నా మినేషన్ల ఉపసంహరణ అదే రోజు సాయంత్రం ఎంపీటీసీ పదవులకు పోటీ చేయు అభ్యర్థుల పేర్లు నోటీస్ బోర్డ్ లో ప్రకటిస్తామన్నారు. నవంబర్ మూడవ తేదీ ఎంపిటిసి ఎన్నికలకు పోలింగ్, నాలుగవ తేదీ అవసరమైన చోట ఎన్నికల అధికారి అనుమతితో రీపోలింగ్, ఐదో తేదీ ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు వెంటనే ఫలితాలు ప్రకటన గెలిచిన అభ్యర్థులకు ఎన్నికల అధికారి చే ధ్రువీ కరణ పత్రం అందజేయడం జరుగుతుందన్నారు.
రిపోర్టర్: బోర్రా శివరామిరెడ్డి మైదుకూరు ఇంచార్జ్ కడప జిల్లా