BREAKING
అనవరంలో వైసీపీలోకి 50 కుటుంబాలు! అభ్యర్థులు ఎంపికలో వైసీపీ, తేదేపా నేతలు కసరత్తు దసరా శుభాకాంక్షలు తెలిపిన నాయకులు మురారి చింతల-దొరికిల్లు కొండపై ఘనంగా విత్తనాలు నాటే కార్యక్రమం-పర్యావరణ పరిరక్షణకు నాంది స్థానిక రాజకీయ సమరంలో మూడుముక్కలాట 33 వ వార్డు వైసిపి కౌన్సిలర్ అభ్యర్థి పై దాడి ఎన్నికల నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలి జడ్పీటీసీ బరిలోకి ఎన్ని శ్రీనివాసరావు...!! విధుల్లోనే మృతి చెందిన గ్రామ పంచాయతీ కార్మికుడు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు: డీఎస్పీ రమణారావు పండుగ సాయన్న జయంతి పోస్టర్ ఆవిష్కరణ ఉత్తరాంధ్ర అరుదైన కళాకారిణి జీవిత కథ ఆధారంగా ప్రేక్షకుల ముందుకు 'గరివిడి లక్ష్మి'! రాజీవ్ గాంధీకి ఘన నివాళులు పరకాల శివాలయాన్ని దర్శించుకున్న రైతు రుణ విమోచన కమిషన్ మాజీ చైర్మన్ నాగూర్ల వెంకన్న చైన్ స్నాచర్ల ముఠా అరెస్టు -13 దోపిడీలలో 57 లక్షల 352 గ్రాముల బంగారు స్వాధీనం

అంబరాన్నంటిని బతుకమ్మ సంబరాలు-విజేతలకు బహుమతులు అందజేసిన స్వయంకృషి సంస్థ

Select Suryaa Now
అంబరాన్నంటిని బతుకమ్మ సంబరాలు-విజేతలకు బహుమతులు అందజేసిన స్వయంకృషి సంస్థ

కాటారం, మేజర్ సూర్య న్యూస్, మండల కేంద్రంలో సద్దుల బతుకమ్మ పండుగను పురస్కరించుకొని ‘స్వయంకృషి’ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ సంబరాలు, పోటీలు అత్యంత వైభవంగా ముగిశాయి. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విజేతలకు సంస్థ నిర్వాహకులు బహుమతులను ఘనంగా ప్రదానం చేశారు. పోటీల్లో దామరకుంట గ్రామానికి చెందిన రత్నం శంకరమ్మ ప్రథమ బహుమతి సాధించగా, గారేపల్లి గ్రామానికి చెందిన సూదాటి శిరీష ద్వితీయ బహుమతిని, పడకంటి అంజలి తృతీయ బహుమతిని అందుకున్నారు. అలాగే గుమ్మలపల్లి గ్రామానికి చెందిన పెనుగొండ సాయి ప్రణీత నాల్గవ బహుమతిని కైవసం చేసుకున్నారు.ఈ సందర్భంగా బహుమతులు అందుకున్న మహిళలు తమ సంతోషాన్ని పంచుకుంటూ పండుగ వేళ ఇలాంటి పోటీలు నిర్వహించి తమను ప్రోత్సహించడంపై ఆనందం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధి కొట్టే సతీష్ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకల్లో మహిళలు ఎంతో ఉత్సాహంగా పాల్గొని, రంగురంగుల బతుకమ్మలను ప్రదర్శించి పండుగ వాతావరణాన్ని తీసుకువచ్చారని కొనియాడారు. ఈ పోటీలను విజయవంతం చేసిన ప్రతి మహిళకు, పాల్గొన్న ప్రతి కుటుంబానికి ఆయన సంస్థ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమ నిర్వహణకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకారం అందించిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక కృతజ్ఞతలు ప్రకటించారు. ప్రజా భాగస్వామ్యం, స్థానికుల ప్రోత్సాహమే తమ స్వచ్ఛంద సంస్థకు నిజమైన బలమని, భవిష్యత్తులోనూ ప్రజల ఆదరాభిమానాలు, సహకారం ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో  గ్రామ సర్పంచ్ కోడిపెల్లి పద్మా రాము, ఉప సర్పంచ్ ముద్దం బాపు యాదవ్,,ఏఎంసీ డైరెక్టర్ రామగుండ శ్రీనివాస్ శర్మ, మాజీ సర్పంచ్ బాసాని రఘువీర్, వార్డు మెంబర్ ప్రవీణ్, గోనె మహేష్, మొగిలి లచ్చయ్య యాదవ్. తదితరులు పాల్గొన్నారు..

రిపోర్టర్: గోనే సుధాకర్ రెడ్డి, కాటారం, జయశంకర్ భూపాలపల్లి...