BREAKING
కస్టడీ పొడిగింపుపై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సీజేపీ నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా: ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఉత్తర్వుల సవాలు! గుజరాత్‌లో నాలుగు ఘోర రోడ్డు ప్రమాదాలు: విధుల్లో ఉన్న పోలీస్ సబ్-ఇన్‌స్పెక్టర్ సహా 11 మంది దుర్మరణం! గ్రేటర్ నోయిడాలో 19వ రెన్యూవబుల్ ఎనర్జీ ఇండియా ఎక్స్‌పో: 1,080 మంది ఎగ్జిబిటర్లతో స్వచ్ఛ ఇంధన సాంకేతికతల ప్రదర్శన! ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణతో కాంగ్రెస్ బెంబేలు: బీజేపీ నేత శ్రీకాంత్ శర్మ తీవ్ర వ్యాఖ్యలు! పలమనేరు మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ 33 వార్డుల్లో పోటీ యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో మరో కీలక ఘట్టం: 5వ యూనిట్ ట్రయల్ రన్ విజయవంతం వెల్దుర్తి మండల అభివృద్ధికి సుబ్బారాయుడు కుటుంబం కృషి అభినందనీయం ముంబైలోని చారిత్రక గేట్‌వే ఆఫ్ ఇండియాను సందర్శించిన అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో: 26/11 అమరులకు నివాళి! శ్రీకాకుళం బీచ్‌లో తీవ్ర విషాదం: స్నానానికి వెళ్ళి నలుగురు గల్లంతు కృష్ణానదిలో వైభవంగా దుర్గమ్మ తెప్పోత్సవం: హంస వాహనంపై భక్తులకు అభయమిచ్చిన దుర్గామల్లేశ్వరులు 34వ డివిజన్‌లో సరిపూటి రమణ ప్రచార హోరు.. ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థన.. బైరాగి గూడా లో ఘనంగా దసరా వేడుకలు దుర్గామాత సేవలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సంజీవరెడ్డి జానంపేటలో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే రేగా ఇంటిపై టి.డి.పి గుండాలదాడి నామినేషన్ తిరస్కరించడంపై పోరెడ్డిని కలిసి రెడ్యం

నాగర్ కర్నూల్ లో ఉరి తాళ్లతో జాతీయ ఆరోగ్య మిషన్‌ ఉద్యోగుల నిరసన* ప్రభుత్వం ఆదుకోకపోతే ఉరి తాళ్లే దిక్కవుతాయి , జాతీయ ఆరోగ్య మిషన్‌ ఉద్యోగులు

Select Suryaa Now
నాగర్ కర్నూల్ లో ఉరి తాళ్లతో జాతీయ ఆరోగ్య మిషన్‌  ఉద్యోగుల నిరసన*  ప్రభుత్వం ఆదుకోకపోతే ఉరి తాళ్లే దిక్కవుతాయి , జాతీయ ఆరోగ్య మిషన్‌  ఉద్యోగులు

జాతీయ ఆరోగ్య మిషన్‌ (NHM) పరిధిలో వివిధ క్యాడర్లలో పనిచేస్తున్న ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం నాగర్‌కర్నూల్ జిల్లాలో చేపట్టిన నిరవధిక సమ్మె సోమవారం ఏడో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆధ్వర్యంలో జాతీయ ఆరోగ్య మిషన్‌ ఉద్యోగులు మెడలో ఉరి తాళ్లు వేసుకుని వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ, ఎన్నో ఏళ్లుగా కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ విధానాల్లో పనిచేస్తూ ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నప్పటికీ తమ సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా తమను ఆదుకోకపోతే తమకు ఉరి తాళ్లే దిక్కవుతాయని ఆవేదనతో పేర్కొన్నారు. తమ పరిస్థితిని అర్థం చేసుకుని ముఖ్యమంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి వెంటనే స్పందించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, ఉద్యోగులకు ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్  కల్పించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా వార్షిక ఇంక్రిమెంట్లు, లాయల్టీ బోనస్, 180 రోజుల ప్రసూతి సెలవులు వంటి సదుపాయాలను అమలు చేయాలని కోరారు.ప్రజారోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న జాతీయ ఆరోగ్య మిషన్‌ ఉద్యోగుల సేవలను ప్రభుత్వం గుర్తించి, వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని జేఏసీ  నాయకులు విజ్ఞప్తి చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకు నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జాతీయ ఆరోగ్య మిషన్‌ జేఏసీ జిల్లా అధ్యక్షుడు డా. బాలకృష్ణ, ప్రధాన కార్యదర్శి దామగట్ల కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు గౌస్ పాషా, వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాసులు, కోశాధికారి ప్రవీణ్, JAC సభ్యులు డా. జగన్, డా. రామకృష్ణ రెడ్డి, సురేష్, భీముడు తదితరులు పాల్గొన్నారు.

పి.వినయ్ కుమార్,  నాగర్‌కర్నూల్ క్రైమ్,సూర్య న్యూస్