కోమటి చెరువు పై అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ..!
సిద్దిపేట అర్బన్,మేజర్ న్యూస్ :;తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సద్దుల బతుకమ్మ వేడుకలు సిద్దిపేట పట్టణంలోని కోమటి చెరువు వద్ద అంగరంగ వైభవంగా జరిగాయి. రంగురంగుల పూలతో అందంగా పేర్చిన బతుకమ్మలతో మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి, పాటలు, ఆటపాటలతో పండుగ సంబరాలను అంబరాన్నంటేలా నిర్వహించారు. ఈ వేడుకల్లో సిద్దిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి పూజల హరికృష్ణ పాల్గొని మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు.
సంప్రదాయ దుస్తుల్లో తరలివచ్చిన మహిళలు వివిధ రకాల పూలతో బతుకమ్మలను అందంగా అలంకరించి వేడుకల్లో పాల్గొన్నారు. బతుకమ్మ పాటలతో కోమటి చెరువు పరిసరాలు పండుగ శోభను సంతరించుకున్నాయి. ఈ సందర్భంగా పూజల హరికృష్ణ మహిళలను ఆప్యాయంగా పలకరిస్తూ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారితో కలిసి బతుకమ్మ ఆడి పండుగ సంతోషాలను పంచుకున్నారు.
ఈ సందర్భంగా పూజల హరికృష్ణ మాట్లాడుతూ, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. ప్రకృతిని ఆరాధిస్తూ, వివిధ రకాల పూలతో బతుకమ్మను పేర్చి జరుపుకునే ఈ పండుగ మహిళల ఐక్యతకు, తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతిబింబమని పేర్కొన్నారు. తరతరాలుగా వస్తున్న సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించడంలో బతుకమ్మ వంటి పండుగలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.
మన సంస్కృతిని, సంప్రదాయాలను కాపాడుకుంటూ పండుగలను ఐకమత్యంతో జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. సిద్దిపేట పట్టణ మహిళలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో కోమటి చెరువు వద్ద సద్దుల బతుకమ్మ వేడుకలు సందడిగా సాగాయి.
పలువురు నాయకుల పాల్గొనడం
ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ పూజల గోపికృష్ణ, మైనారిటీ జిల్లా చైర్మన్ రషద్, మైనారిటీ టౌన్ ప్రెసిడెంట్ ఎం.డి. అతిఫ్, ఏఎంసీ వైస్ చైర్మన్ సాధుల పవన్, ప్రభాకర్, చోట అజ్మత్, దస్తగిరి, ఫైసల్, షాను, ఆసిఫ్, ముబషీర్, ఫెరోజ్, ఫడోస్, దుర్గాప్రసాద్, సోహైల్ తదితరులు పాల్గొన్నారు.
సూర్య న్యూస్ : సిద్దిపేట అర్బన్, దేవులపల్లి భూపతి.