BREAKING
అక్టోబర్ 22న పండుగ సాయన్న జయంతి రంజీ ట్రోఫీలో చెలరేగిన ఆయుష్ బడోని.. అద్భుత డబుల్ సెంచరీతో ఢిల్లీ భారీ స్కోర్! వైభవంగా బింద సేవ మహో త్సవం. కావలి పురపాలక సంఘంలో వైభవంగా 'ఆయుధ పూజ' ఈనెల 26న చలో హైదరాబాద్ కు వేలాదిగా తరలి రండి-బొట్ల చక్రపాణి జింబాబ్వేతో మ్యాచ్‌లో అరుదైన ప్రపంచ రికార్డు సృష్టించిన భారత మహిళా క్రికెటర్ నికి ప్రసాద్! ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులు త్వరగా పరిష్కరించాలి - నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ *నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గ భవాని మాత వద్ద అన్నదాన కార్యక్రమం* రీల్‌లోనే కాదు రియల్ లైఫ్‌లోనూ హీరోనే.. ప్రాణాపాయంలో ఉన్న డ్రైవర్‌ను కాపాడిన టైగర్ ష్రాఫ్! మణుగూరు మెడికల్ షాపుల్లో ఆకస్మిక తనిఖీలు అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్నా రెండు టిప్పర్లు స్వాధీనం గ్లామరస్ ఫొటోషూట్‌తో అదరగొడుతున్న ప్రియాంక చోప్రా.. హాలీవుడ్‌లోనూ సత్తా చాటుతున్న గ్లోబల్ స్టార్! ఎంపీటీసీ ఎన్నికలకు 21 నుండి నామినేషన్లు - ఎంపీడీవో జవహర్ బాబు సరికొత్తగా 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్: ఆఫ్టర్ డార్క్' వెబ్ సిరీస్.. సంచలన లుక్‌తో షనయా కపూర్ ఎంట్రీ! నాగర్ కర్నూల్ రామాలయంలో మంగళవారం దసరా శమీ పూజలు, వాహన పూజలు, అర్చనలు.…

ఏజెన్సీలో 50 శాతానికి పైగా స్థానాల్లో పోటీ

Select Suryaa Now
ఏజెన్సీలో 50 శాతానికి పైగా స్థానాల్లో పోటీ
 అరకు (ఏజెన్సీ): అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులో జనసేన పార్టీ కీలక సమావేశం అత్యంత ఉత్సాహపూరిత వాతావరణంలో జరిగింది. ఈ సమావేశంలో పార్టీ ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు ముఖ్య అతిథిగా పాల్గొని, పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఏజెన్సీ ప్రాంతాలపై జనసేన పార్టీకి ప్రత్యేక అనుబంధం ఉందని స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో ఏజెన్సీ పరిధిలోని 50 శాతానికి పైగా స్థానాల్లో తమ పార్టీ అభ్యర్ధులను బరిలో నిలుపుతామని ప్రకటించారు. ఇప్పటికే దీనికి సంబంధించి సమర్థులైన అభ్యర్థులను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.

గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలు, కష్టాలను శాశ్వతంగా పరిష్కరించే దిశగా జనసేన పార్టీ నిరంతరం కృషి చేస్తుందని నాగబాబు భరోసా కల్పించారు. ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కల్యాణ్ ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నారని, గిరిజన ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారని కొనియాడారు.

ఈ సమావేశంలో స్థానిక జనసేన పార్టీ కేడర్, నాయకులు భారీ సంఖ్యలో పాల్గొని పార్టీ బలోపేతంపై చర్చించారు.