వైసీపీ నుంచి టిడిపిలోకి చేరికలు
ఆత్రేయపురం మండలంలోని నార్కెడిమిల్లి గ్రామంలో గురువారం ఎస్సీ, బీసీ, ఓసీ వర్గాలకు చెందిన 100 కుటుంబాలు పైగా నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు వీరికి కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పార్టీ కండువాలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు మాజీ సర్పంచ్ మద్దింశెట్టి వీర వెంకట సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ వర్గాలకు చెందిన ప్రజలు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేస్తోందని, రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతోందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రాజెక్ట్ కమిటీ వైస్ చైర్మన్ కరుటూరి నరసింహారావు వాడపల్లి దేవస్థానం చైర్మన్ ముదునూరి వెంకటరాజు మండల టిడిపి అధ్యక్షులు కూసంపూడి రామకృష్ణంరాజు క్లస్టర్ ఇంచార్జ్ ముళ్ళపూడి భాస్కరరావు, మెర్ల నాగేశ్వరరావు, తెలుగు యువత అధ్యక్షులు వెచ్చా అనిల్ కుమార్, సొసైటీ అధ్యక్షులు నాగిరెడ్డి సత్యనారాయణ, వాకలపూడి వెంకట కృష్ణారావు, మద్దూరు సుబ్బారావు, కాయల జగన్నాథం, పాలింగి రవిచంద్ర, తోట రజిని, దండు సీతారామరాజు, గోపాల రాజు, దొడ్డపనేని త్రినాధ్, చిటికెన సత్యనారాయణ, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు