BREAKING
అసత్యంపై ఎల్లప్పుడూ సత్యమే గెలుస్తుంది: ద్వారక దసరా వేడుకల్లో ఢిల్లీ సీఎం రేఖా గుప్తా.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఘన స్వాగతం! భారత విమానయాన రంగంలో రికార్డుల ప్రస్థానం: 2047 నాటికి 130 కోట్ల ప్రయాణికులే లక్ష్యం.. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడి! సంపద, విజ్ఞానం, శక్తి కలబోసిన భారత్‌గా తీర్చిదిద్దడమే మోదీ ప్రభుత్వ లక్ష్యం: తజికిస్తాన్‌లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టీకరణ! కొద్ది వారాల్లోనే భారత్-అమెరికా చారిత్రక వాణిజ్య ఒప్పందం: యూఎస్ విదేశాంగ మంత్రి మార్కో రూబియో సంచలన ప్రకటన! ఉగ్రవాదంపై మా భాగస్వామ్య దేశాలు జీరో టాలరెన్స్ చూపించాలి: విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ స్పష్టీకరణ.. తహవ్వుర్ రాణా అప్పగింతపై హర్షం! 'ఉడాన్' పథకానికి పదేళ్లు: దేశవ్యాప్తంగా 1.72 కోట్ల మందికి విమాన ప్రయాణం.. 687 రూట్లతో సామాన్యుడి సొంతమైన ఆకాశం! భారత్-న్యూజిలాండ్ చారిత్రక వాణిజ్య ఒప్పందం అమలు.. ఇరుదేశాల హర్షం! హరిహర క్షేత్రంలో ఘనంగా శమి పూజలు 2029 డిసెంబర్ 31 నాటికి పంజాబ్‌ను ‘నశా ముక్త్’గా మారుస్తాం: కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టమైన డెడ్‌లైన్! ఎన్నికలు రాగానే పంజాబ్ గుర్తొచ్చిందా?: అమిత్ షాపై భగవంత్ మాన్ ధ్వజం! కాలనేమి కూడా రాముడి నామాన్ని జపించేవాడు: అయోధ్యపై విపక్షాల దుష్ప్రచారంపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర వ్యాఖ్యలు! మహారాష్ట్రలో ప్రభుత్వం మారాల్సిందే: దసరా ర్యాలీలో బీజేపీపై శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే తీవ్ర ధ్వజం! అమెరికాలో 3 లక్షల వీసాల రద్దు.. నేరస్థులపై ఉక్కుపాదం! పాకిస్తాన్, సౌదీ అరేబియాతో చారిత్రక 'మక్కా రక్షణ ఒప్పందం': ధ్రువీకరణ కోసం పార్లమెంటుకు పంపిన టర్కీ ప్రభుత్వం! ఇంధన సంక్షోభంపై మాక్రాన్ వ్యూహం: గల్ఫ్ దేశాల నుంచి భారీగా డీజిల్ కొనుగోలు

వైభవంగా శ్రీ షిరిడి సాయినాధుని ఆరాధన ఉత్సవాలు

Select Suryaa Now
వైభవంగా శ్రీ షిరిడి సాయినాధుని ఆరాధన ఉత్సవాలు

భట్టిప్రోలు, మేజర్ న్యూస్: భట్టిప్రోలు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ షిరిడి సాయి దత్తాత్రేయ స్వామి వారి ఆలయంలో శ్రీ షిరిడి సాయిబాబా వారి 108వ ఆరాధన మహోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి.ఈ ఉత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం బాబా వారి ఉత్సవ విగ్రహానికి అన్నాభిషేకం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అన్నంతో అభిషేకం చేస్తూ భక్తులు సాయి నామస్మరణ చేశారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు, అన్నప్రసాద వితరణ చేశారు. అన్నాభిషేక కార్యక్రమంలో అన్నవరపు వెంకట సుబ్బారావు-అనిత లక్ష్మి, బొంత కృష్ణ - తన్మయి, తూనుగుంట్ల వంశీకృష్ణ - గౌతమి, గొట్టుముక్కల లోకనాథ్ - దేవి శ్రీలక్ష్మి, గోనుగుంట్ల హరీష్ కుమార్ - కౌసల్య దంపతులు పాల్గొని స్వామి వారికి అభిషేకం నిర్వహించారు.
అభిషేకాది కార్యక్రమాలను దేవస్థాన ప్రధాన అర్చకులు  మురికిపూడి దుర్గాప్రసాద్ శర్మ వారి కుమారుడు భాను ప్రకాష్ శర్మ వేద మంత్రాలతో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమాలను దేవస్థాన అధ్యక్షులు తమ్మన రమేష్ బాబు, ఉపాధ్యక్షులు బట్టు రమేష్ బాబు, చెన్నగిరి పాపారావు, కోశాధికారి బూరెల కిరణ్ కుమార్, కార్యనిర్వహక కార్యదర్శి జవ్వాది వెంకటేశ్వరరావు, ఉత్సవ నిర్వహణ కమిటీ సభ్యులు తట్టవర్తి అర్ధనారీశ్వరుడు, చందలూరు రామకోటేశ్వరరావు, చందలూరు శివప్రసాద్, కమిటీ సభ్యులు పర్యవేక్షించారు.