BREAKING
జాతీయ స్థాయి పోటీలకు పి ఎం శ్రీ మోడల్ స్కూల్ విద్యార్థులు.. బోరవానిపేటలో కేంద్ర బృందం పర్యటన ఏర్పాట్లులను పరిశీలన మౌలానా అబుల్ కలాం ఆజాద్ కు ఘన నివాళి . పుస్తక ఆకారంలో విద్యార్థుల వినూత్న ప్రదర్శన.. పంచాయితీ ఎన్నికలకు సర్వం సిద్ధం ట్రస్మా రంగారెడ్డి జిల్లా నూతన కమిటీ నియామకం రాజ్యాంగ దినోత్సవ పోటీల్లో విద్యార్థుల ప్రతిభ... దళితులకు పదవులు కేటాయించే వరకు ఉద్యమిస్తాం -దళిత సంఘాల హెచ్చరిక పాతపట్నం ‘ఉమా సినీ మ్యాక్స్’ పై ఫుడ్ ఇన్‌స్పెక్టర్ దాడులు. ఐపీఎల్‌లో మరో రెండు కొత్త జట్ల చేరికకు రంగం సిద్ధం.. రేసులో పుణె, వడోదర ముందంజలో! సీపీఎస్ ఉద్యోగులకు ఓపీఎస్‌లోకి మారే అవకాశం కల్పించడం హర్షణీయం శివ శంకర కాలనీ, టీచర్స్ కాలనీలో టీడీపీ ఎన్నికల ప్రచారం. షిఫ్ట్ ఆపరేటర్ల సమస్యలు పరిష్కరించాలి భారత్ - న్యూజిలాండ్ నాలుగో వన్డే.. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో కీలక మార్పులతో బరిలోకి దిగనున్న టీమిండియా! యువత స్వయం ఉపాధికి ప్రభుత్వ ప్రోత్సాహం

వైభవంగా కార్తీక దీపోత్సవం ఆకాశదీపం వెలిగించిన మంత్రి సతీమణి రమాదేవి

Select Suryaa Now
వైభవంగా కార్తీక దీపోత్సవం  ఆకాశదీపం వెలిగించిన మంత్రి సతీమణి రమాదేవి

నెల్లూరు,  మేజర్ న్యూస్ :     మూలాపేట మూలస్థానేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాస ప్రారంభం సందర్భంగా కార్తీక దీపోత్సవం వైభవంగా నిర్వహించారు. మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ సతీమణి పొంగూరు రమాదేవి  ఆకాశదీపాన్ని వెలిగించారు.రమాదేవికి   మేయర్ రూప్ కుమార్, ఆలయ ఈఓ శ్రీనివాసులు రెడ్డి, టీడీపీ నాయకులు ఘనస్వాగతం పలికారు.అనంతరం భువనేశ్వరీ సమేత మూలస్థానేశ్వర స్వామిని దర్శించుకుని రమాదేవి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్దసంఖ్యలో తరలివచ్చిన మహిళలు భక్తిశ్రద్ధలతో కార్తీక దీపాలు వెలిగించడంతో ఆలయ ప్రాంగణం దీపకాంతులతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. శివనామ స్మరణలతో ఆలయ ప్రాంగణం మార్మోగింది.ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ పరమశివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన కార్తీక మాస ప్రారంభ వేడుకలు కనులపండువగా జరగడం ఆనందంగా ఉందన్నారు. ఆకాశదీపం వెలిగించే అవకాశం లభించడం తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. మహిళలు భక్తిశ్రద్ధలతో దీపాలు వెలిగించి కార్తీక మాస వేడుకల్లో పాల్గొన్నారని, మంజునాథుడి ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించినట్లు పేర్కొన్నారు. మేయర్ రూప్ కుమార్ మాట్లాడుతూ మంత్రి నారాయణ ఆధ్వర్యంలో నగర అభివృద్ధితో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలకూ ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. కార్తీక మాస ప్రారంభం సందర్భంగా రమాదేవి ఆకాశదీపం వెలిగించడం సంతోషకరమన్నారు. ప్రజలంతా భక్తిశ్రద్ధలతో కార్తీక మాసాన్ని జరుపుకుని ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు గండవరం లక్ష్మి, అన్నంగి సమత, గుణుకుల విజయలక్ష్మి, కాపు భవన్ కమిటీ సభ్యురాలు సూరిశెట్టి గాయత్రి, మెంటా కళ్యాణి, ఆలయ పాలకమండలి చైర్మన్ పుట్టా అజయ్, పాలకమండలి సభ్యులు, ఏకేఎం సత్రం చైర్మన్ మహేష్, రామాలయం చైర్మన్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.