BREAKING
బొడ్డు చింతలపల్లి లో ఉచిత గర్భకోశ వ్యాధుల చికిత్స శిబిరం భూ సేకరణలో అక్రమాలు జరిగినట్లు నిరూపిస్తా...! బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టిస్తున్న రణ్‌బీర్ కపూర్ 'రామాయణం'.. వేగంగా వెయ్యి కోట్ల క్లబ్ వైపు దూకుడు! సీఐ విశ్వేశ్వర్ విశ్వరూపం మరోసారి సింగర్‌గా మారిన బాలకృష్ణ.. 'దాదా ధమాకా' ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్! వివాదాల నడుమ కమల్‌హాసన్ కొత్త సినిమా టైటిల్.. రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ తెరపైకి 'సండియర్' చర్చ! తొలి సినిమా విడుదల కాకుండానే క్రేజ్ సొంతం చేసుకున్న శ్రీకాంత్ కుమార్తె మేధా మేకా.. వరుస ఆఫర్లతో దూకుడు! బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తున్న సూర్య 'సీన్' సినిమా.. వంద కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టిన క్రైమ్ కామెడీ చిత్రం! ప్రతిరోజూ పుదీనా ఆకులు తింటే శరీరంలో జరిగే అద్భుతాలు.. ఆరోగ్య నిపుణులు చెబుతున్న ముఖ్యమైన విషయాలు! ప్రతిరోజూ తగినన్ని నీరు తాగడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు.. వైద్యులు చెబుతున్న ముఖ్యమైన సూచనలు! ఉదయం త్వరగా నిద్రలేవడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు.. నిపుణులు చెబుతున్న ముఖ్యమైన విషయాలు! ఆవేశం, సీన్ చిత్రాలకు సీక్వెల్స్ ఉండవు.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ జిత్తు మాధవన్! ముంబైకి చేరుకున్న ప్రముఖ సింగర్ రిమి టోమి.. లిబిన్ మాథ్యూతో వివాహం కోసం జోరుగా ఏర్పాట్లు! నాని 'ది ప్యారడైజ్' టీమ్‌పై సీనియర్ నటుడు బాబు మోహన్ సంచలన వ్యాఖ్యలు.. లుక్ టెస్ట్ చేసి అలాగే వదిలేశారంటూ ఆగ్రహం! నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండింగ్‌లో విజయ్ సేతుపతి సంచలన సినిమా.. ఓటీటీలో వ్యూవర్స్‌ను కట్టిపడేస్తున్న చిత్రం!

పుస్తక ఆకారంలో విద్యార్థుల వినూత్న ప్రదర్శన..

Select Suryaa Now
పుస్తక ఆకారంలో విద్యార్థుల వినూత్న ప్రదర్శన..


- విజ్ఞాన భారతి పాఠశాలలో జాతీయ విద్యా దినోత్సవం.

నరసన్నపేట, నవంబర్ 11 మేజర్ న్యూస్: భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి, భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకుని నరసన్నపేటలోని విజ్ఞాన భారతి పాఠశాలలో జాతీయ విద్యా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేపట్టిన వినూత్న ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.విద్య ప్రాముఖ్యతను, పుస్తక పఠనం ద్వారా లభించే విజ్ఞానాన్ని సమాజానికి చాటిచెప్పే ఉద్దేశంతో విద్యార్థులంతా కలిసి పుస్తక ఆకారంలో కూర్చుని ప్రదర్శన నిర్వహించారు. దేశ భవిష్యత్తు నిర్మాణంలో విద్య కీలక పాత్ర పోషిస్తుందని, పుస్తకాలు విజ్ఞానానికి నిధులని ఈ ప్రదర్శన ద్వారా చాటిచెప్పారు. విద్యార్థుల సమిష్టి ఆలోచన, సృజనాత్మకతను ఈ కార్యక్రమం ప్రతిబింబించింది.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానాచార్యులు డి. ఢిల్లేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు పుస్తక పఠనాన్ని అలవర్చుకోవాలని సూచించారు. ఉన్నత లక్ష్యాలను సాధించడానికి నిరంతర అధ్యయనం ఎంతో అవసరమని, మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఆశయాలను ఆదర్శంగా తీసుకుని విద్యారంగంలో రాణించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీదేవి, రమణమూర్తి, శైలజ, అరుణకుమారి, సూర్యనారాయణ, అనురాధ, హేమకుమారి, అంజలి, రేవతి తదితరులు పాల్గొన్నారు.