వైభవంగా చండీ హోమం
ఉదయగిరి,మేజర్ న్యూస్ : పట్టణంలోని బీసీ కాలనీ సమీపంలో వెలసి ఉన్న సంతానలక్ష్మి ఆలయ ఆవరణలో దేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా సోమవారం భక్తులు చండీ హోమం నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్ఛరణల నడుమ జరిగిన ఈ హోమంలో దంపతులు అధికసంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తుల సౌకర్యార్థం అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు.