ఉయ్యూరులో మూడు వార్డుల్లో కూటమి నేతల ప్రచారం
ఉయ్యూరు మేజర్ న్యూస్ : మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు వై.వీ.బీ. రాజేంద్రప్రసాద్, జిల్లా టీడీపీ అధ్యక్షులు వీరంకి గురుమూర్తి శుక్రవారం ఉయ్యూరులోని ఒకటో వార్డు ఎగినపాడు–నాగన్నగూడెం, 13వ వార్డు ఏజీకే నగర్, 22వ వార్డు కాపుల రామాలయం సెంటర్‌లో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బడుగు, బలహీన వర్గాల సంక్షేమంతో పాటు పట్టణంలో రహదారులు, డ్రైనేజీలు, తాగునీటి సౌకర్యాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. వీరంకి గురుమూర్తి మాట్లాడుతూ పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు అసంపూర్తిగా ఉన్న టిడ్కో ఇళ్లను మరమ్మతులు చేసి అర్హులకు అందించే చర్యలు చేపడుతున్నామని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం కొనసాగాలంటే కూటమి అభ్యర్థులను గెలిపించాలని, టీడీపీకి సైకిల్ గుర్తుపై, జనసేనకు గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వెలగపూడి శంకర్ బాబు, బొగ్గవరపు వాసు, రామినేని కుటుంబయ్య, వల్లభనేని సత్యనారాయణ, రత్నం శివప్రసాద్ బుజ్జి, చేదుర్తిపాటి ప్రవీణ్ కుమార్, మోటు నాగేంద్రం, బొర్రా సుబ్బారావు, గంగాభవాని తదితరులు పాల్గొన్నారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, పెనమలూరు నియోజకవర్గం, కృష్ణాజిల్లా.