BREAKING
ప్రజల సంక్షేమమే కూటమి లక్ష్యం 54వ డివిజన్ కార్పొరేటర్ గెలుపుకు కూటమినేతలు ప్రచారం ప్రచార ఘట్టం..జన ప్రభంజనం... -వైసీపీకి బుద్ధి చెప్పి..కూటమికి పట్టం కట్టండి -హోరెత్తించిన జేబీ ప్రచార ర్యాలీ -జనసంద్రంగా మారిన కొర్లగుంట జంక్షన్ -వేల సంఖ్యలో కదం తొక్కిన కూటమి నేతల -ముగిసిన కూటమి ప్రచార పర్వం నేటి పంచాంగం 30 అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –30 అక్టోబర్ 2026 గెలుపు నీదనయ్య శంకర -53వ డివిజన్ ప్రచారంలో శంకర్ యాదవ్ కు మహిళలు ఆశీర్వాదం ఏసీ గదిలో గంటల తరబడి ఉంటున్నారా? మీ చర్మం మరియు కళ్లపై పడే తీవ్ర ప్రభావాలు ఇవి పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ అందించాలి ఉదయాన్నే మెంతులు నానబెట్టిన నీరు తాగుతున్నారా? ఆరోగ్యానికి కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఇవే ప్రాచ్య కళాశాలలో ఘనంగా అష్టావధానం ఉమ్మడి చిత్తూరు జిల్లా కరాటే ఎంపిక పోటీలు జంక్ ఫుడ్ నివారించి ఆరోగ్యంగా జీవిద్దాం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి ఘనంగా శుభప్రదం మాల్ ప్రారంభం వృధాగా పోతున్న పాకాల చెరువు నీళ్లు త్రాగునీటి సమస్య పరిష్కారమే నా లక్ష్యం -62వ డివిజన్ ప్రచారంలో పార్థసారథి హామీ

ఉయ్యూరులో 30, 32 వార్డుల్లో రాజేంద్రప్రసాద్ ప్రచారం

Select Suryaa Now
ఉయ్యూరులో 30, 32 వార్డుల్లో రాజేంద్రప్రసాద్ ప్రచారం

ఉయ్యూరు మేజర్ న్యూస్ : ఉయ్యూరు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ ఎమ్మెల్సీ వై.వీ.బీ. రాజేంద్రప్రసాద్ శుక్రవారం 30, 32వ వార్డుల్లో విస్తృతంగా పర్యటించారు. ఆయా వార్డుల కౌన్సిలర్ అభ్యర్థులు రాజులపాటి అంజనాదేవి, జంపాన విజయలక్ష్మితో పాటు చైర్మన్ అభ్యర్థి చేదుర్తిపాటి ప్రవీణ్ కుమార్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా పాలన సాగుతోందన్నారు. వారి నాయకత్వాన్ని మరింత బలోపేతం చేస్తూ ఉయ్యూరు మున్సిపాలిటీలో కూటమి అభ్యర్థులను గెలిపించి పట్టణ అభివృద్ధికి సహకరించాలని కోరారు. కూటమి ప్రభుత్వంతోనే ఉయ్యూరు పట్టణ అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. ఈ ప్రచారంలో చేదుర్తిపాటి ప్రవీణ్ కుమార్, మాజీ మున్సిపల్ చైర్మన్లు వల్లభనేని సత్యనారాయణ, జంపాన పూర్ణచంద్రరావు, రత్నం బుజ్జి, వంగవీటి శ్రీనివాస్ ప్రసాద్, జంపాన వీర శ్రీనివాస్, సయ్యద్ అజ్మతుల్లా, రాజులపాటి ఫణి, వార్డు పరిశీలకుడు రమేష్, చలపాటి శ్రీను తదితర నాయకులు, ముస్లిం మైనార్టీ మహిళలు పాల్గొన్నారు.

స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, పెనమలూరు నియోజకవర్గం, కృష్ణాజిల్లా.