BREAKING
టాలీవుడ్‌లో కొత్త ప్రయోగానికి సిద్ధమవుతున్న ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి ఉద్యానవన ఉత్పత్తులకు మిట్స్ యూనివర్శిటీ ప్రోత్సాహం హ్యాట్రిక్ హీరో శివరాజ్‌కుమార్ ‘Bail’ మూవీ రిలీజ్.. అక్టోబర్ 2న థియేటర్లలోకి పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ బాక్సాఫీస్ వద్ద నాని ‘ది ప్యారడైజ్’ జోరు.. ఎనిమిదో రోజు వసూళ్ల వివరాలు ఇవే విశ్వం కళాశాలలో అట్టహాసంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఉట్కూరు కేజీబీవీ పాఠశాలకు షీల్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్ తాను చనిపోయినా.. మరో వ్యక్తికి వెలుగులు నింపాడు ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల అద్భుత ప్రతిభ జిమ్‌కు వెళ్లకపోయినా ఫిట్‌గా ఉండొచ్చా? రోజువారీ జీవితంలో కదలికను పెంచే సింపుల్ మార్గాలు ఆరోగ్యంగా ఉండటానికి పెద్ద మార్పులు అవసరం లేదు.. రోజూ చేసే ఈ చిన్న పనులతోనే మొదలు పెట్టండి అత్తిలి ఎస్వీఎస్ఎస్ విద్యాసంస్థల సెక్రటరీ & కరస్పాండెంట్‌గా మద్దాల శ్రీనివాస్ ఏకగ్రీవ ఎన్నిక చిన్నారుల భవిష్యత్తుకు పునాది అంగన్వాడి టీఎంజేఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా వత్తుల రఘుపతి రైలు కిందపడిన వ్యక్తికి తీవ్ర గాయాలు పార్లమెంట్ కార్యాలయ భవన పనుల పరిశీలన

ఉపాధ్యాయురాలుగా మారి విద్యార్థులకు పాఠాలు బోధించిన జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి

Select Suryaa Now
ఉపాధ్యాయురాలుగా  మారి విద్యార్థులకు పాఠాలు బోధించిన జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి

 

*విద్య ద్వారానే ఉజ్వల భవిష్యత్తు సాధ్యం*

*విద్యార్థులకు విద్యతో పాటు సామాజిక, వైజ్ఞానిక విషయాలను బోధించాలి*.

*మెనూ ప్రకారం విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలి, లోటుపాట్లు జరిగితే శాఖా పరమైన చర్యలు తప్పవు*.

ఉపాధ్యాయురాలుగా  మారి విద్యార్థులకు పాఠాలు బోధించిన జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి* ... 

ఏలూరు/ జంగారెడ్డిగూడెం, సెప్టెంబరు 30: విద్య ద్వారానే ఉజ్వల భవిష్యత్తు సాధ్యమని,  విద్యార్థులకు విద్యతో పాటు సామాజిక, వైజ్ఞానిక విషయాలను అధ్యయనం చేసి, భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అన్నారు.  జంగారెడ్డిగూడెంలోని సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల (బాలికలు) పాఠశాలను బుధవారం జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి ఆకస్మిక తనిఖీలు చేశారు. వంటశాలను, వండిన పదార్థాలను, నిత్యవసర సరుకులు స్టాకును, మెనూ పట్టికను, టాయిలెట్స్, తరగతి గదులను పరిశీలించి, విద్యార్థులకు అందుతున్న విద్యా బోధన, విద్యా ప్రమాణలా స్థాయిని కలెక్టర్ పరిశీలించారు. అనంతరం వసతి, ఇతర గృహంలో  తదితర సౌకర్యాలను పరిశీలించారు. టీచరుగా మారి విద్యార్థులకు పాఠాలు బోధించి, విద్యార్థులతో మమేకమై కొన్ని ప్రశ్నలను వేసి, జిల్లా కలెక్టరు సమాధానం రాబట్టారు. 

ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ గురుకుల పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని చర్యలు చేపట్టాలని, విద్యతో పాటు వారి ఆరోగ్యం, భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. పరిసరాలు పరిశుభ్రత, నాణ్యతా ప్రమాణాలు పాటించడంలో కాని ఏమాత్రం అలసత్వం వహిస్తే బాధ్యులుపైన కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఉపాధ్యాయులు, వసతిగృహ అధికారులు అంకితభావంతో పనిచేసి విద్యార్థులకు ఉత్తమ ఫలితాలు సాధించేలా ప్రోత్సహించి, స్వంత పిల్లలుగా చూసుకోవాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యకు, వసతిగృహాలకు నిధులు సమకూర్చి ప్రత్యేక దృష్టిపెట్టిందని అన్నారు. పాఠశాలలో బోధన, విద్యార్థులు హాజరు, మౌలిక వసతులు, మధ్యాహ్న భోజన నిర్వహణ తదితర అంశాలు పక్కగా అమలు చెయ్యాలని ఆదేశించారు. ప్రతి విద్యార్థి విద్యలో రాణించేలా ఉపాధ్యాయులు కృషిచెయ్యాలని సూచించారు. పాఠశాల ఉత్తీర్ణశాతాన్ని మరింత పెంచేలా ఉపాధ్యాయులు కలసికట్టుగా పనిచేసి లక్ష్యాలను సాధించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో యం.వి.రమణ, మున్సిపల్ కమీషనరు కె.వి.రమణ, తహశీల్దారు కె.స్లీవజోజి,ఉపాధ్యాయులు, హాస్టల్ వెల్ఫేరు అధికారి, నాన్ టీచింగు సిబ్బంది, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు 

 

 కె.వి రమణారావు జంగారెడ్డిగూడెం