ఉంగరం గుర్తుకు ఓటు.. గ్రామ భవిష్యత్తుకు బాట!
ఉంగరం గుర్తుకు ఓటు.. గ్రామ భవిష్యత్తుకు బాట!
ఓర్వకల్లు మేజర్ న్యూస్:
ఉంగరం గుర్తుపై వేసే ప్రతి ఓటు గ్రామ భవిష్యత్తులో అభివృద్ధికి బాటలు వేస్తుందని ఓర్వకల్లు గ్రామ సర్పంచ్ అభ్యర్థి కాశిరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామంలోని ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుసుకోవడంతో పాటు జగనన్న కాలనీలో పర్యటించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఇళ్లు, కల్పించిన మౌలిక వసతులను చూపిస్తూ కాలనీలో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించారు. గతంలో చేపట్టిన పనులను కొనసాగిస్తూ గ్రామానికి అవసరమైన మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు తనకు అవకాశం కల్పించాలని కోరారు. మైనార్టీలకు షాదీఖానా నిర్మాణానికి కృషి చేయడంతో పాటు సొంత నిధులతో దేవాలయాలు, చర్చిల అభివృద్ధికి సహకరిస్తానని హామీ ఇచ్చారు. కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజల అవసరాలకు ప్రాధాన్యతనిస్తూ గ్రామంలోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఉంగరం గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ ప్రచార కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.