BREAKING
సీజనల్ హాస్టళ్ల నిర్వహణలో నిర్లక్ష్యం, అక్రమాలకు తావిస్తే కఠిన చర్యలు తప్పవు* *విద్యార్థులకు నాణ్యమైన భోజనం, సురక్షిత వసతి, మెరుగైన విద్యా సదుపాయాలు తప్పనిసరిగా కల్పించాలి* *సీజనల్ హాస్టళ్ల నిర్వహణపై ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తాం* *జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి* రామ్ చరణ్, సుకుమార్ ఆర్సీ17 సినిమాలో నటించే ఛాన్స్.. ఆడిషన్స్ వివరాలు ఇవే! ఆర్పీలకు కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వాలి బ్యాంకులపై ప్రజల విశ్వాసాన్ని కాపాడటంలో ఆర్బీఐ కీలక పాత్ర విరాట్ కర్ణ కొత్త సినిమా రుస్తుం టైటిల్ గ్లింప్స్ విడుదల.. పుట్టినరోజు వేళ ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కరువు ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ గన్నవరం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావుతో కలిసి ప్రత్యేక పూజలు. చార్మినార్ పరిసర ప్రాంతాలలో శుక్రవారం ప్రార్థనల సందర్భంగా పోలీసు కమిషనర్ భద్రతా తనిఖీలు హైదరాబాద్‌లో ఆసియా జ్యువెల్స్ షో ప్రారంభం పెద్దవరం గ్రామపంచాయతీ ఎన్నిక ఏకగ్రీవం విజయ్ దేవరకొండ బంగారం లాంటి మనిషి: రష్మికను ప్రభాస్‌తో పోల్చిన రణబాలి సహనటుడు సేవారత్న పురస్కారం అందుకున్న మడిగాల విజయభాస్కర్ రెడ్డి అనుమతి లేని ఏఐ వాడకంపై కఠినంగా ఉండాలి: పర్సనాలిటీ రైట్స్ రక్షణపై అనన్య పాండే కీలక వ్యాఖ్యలు మెల్కోటే పార్క్ లో కార్తీక మాస వనభోజనాలు ఆటో డ్రైవర్ల న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలి

ఏఐ ఫర్ వికసిత్ భారత్ జాతీయ సదస్సు ప్రారంభం

Select Suryaa Now
ఏఐ ఫర్ వికసిత్ భారత్ జాతీయ సదస్సు ప్రారంభం

నగరం, మేజర్ న్యూస్: 
స్థానిక శ్రీ వెలగపూడి రామకృష్ణ స్మారక కళాశాలలో "ఏఐ ఫర్ వికసిత్ భారత్" అనే అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సు శుక్రవారం ప్రారంభించారు. హైదరాబాద్ మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ విభాగం డాక్టర్ ఎ. రవి, మైలవరం లక్కిరెడ్డి బాలి రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ కళాశాల ఏఐ & డేటా సైన్స్ విభాగం అధిపతి కట్టుపల్లి సుధాకర్, విజయవాడ ఆంధ్ర లయోలా ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీరింగ్ కళాశాల ఈసీఈ డీన్  ప్రొఫెసర్ రామకృష్ణ ముళ్లపూడి సదస్సులో ముఖ్య వక్తలుగా పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ కృత్రిమ మేధ భవిష్యత్ అవకాశాలు, పరిశోధన, పరిశ్రమల్లో దాని వినియోగంపై విశ్లేషణాత్మక ప్రసంగాలు చేశారు. గ్రామీణ స్థాయి నుంచి ప్రపంచ స్థాయి వరకు భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడంలో కృత్రిమ మేధ కీలక పాత్ర పోషిస్తుందని వారు పేర్కొన్నారు. తొలుత కళాశాల సెక్రటరీ, కరెస్పాండెంట్  వల్లభనేని బుచ్చయ్య చౌదరి సదస్సును ప్రారంభించి మాట్లాడుతూ వికసిత్ భారత్ నిర్మాణంలో కృత్రిమ మేధ కీలక పాత్ర పోషిస్తోందని, విద్యార్థులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పించాలనే లక్ష్యంతో కంప్యూటర్ సైన్స్, మ్యాథమెటిక్స్, ఎలక్ట్రానిక్స్ విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ అనగాని హరికృష్ణ అధ్యక్షత వహించి మాట్లాడుతూ, విద్యార్థులు సదస్సులోని సాంకేతిక అంశాలను సద్వినియోగం చేసుకొని, భవిష్యత్ ఉద్యోగ అవకాశాలకు అవసరమైన నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ ఆర్. ప్రసన్నబాబు, కార్యాలయ సూపరింటెండెంట్ అమరేష్ రెడ్డి, కంప్యూటర్ సైన్స్, మ్యాథమెటిక్స్, ఎలక్ట్రానిక్స్ విభాగాల అధ్యాపకులు, ఇతర విభాగాల అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.