BREAKING
నేటి పంచాంగం: 17 అక్టోబర్ 2026.. నేటి రాశి ఫలాలు: 17 అక్టోబర్ 2026.. ద్వాదశ రాశుల వారి దిన ఫలాలు మరియు గ్రహ స్థితిగతులు యువత క్రీడల్లో రాణించాలి అందరూ గెలవాలి -ఆనం గౌరవం నిలపాలి ఎన్నికల నేపథ్యంలో ప్రజలకు అవగాహన కల్పించిన ఎస్‌ఐ జంపాని కుమార్ అక్బరాబాదులో సేవ సంకల్ప అభియాన్ వైద్య శిబిరం చిన్నారిని ఆశీర్వదించిన మున్సిపల్ చైర్ పర్సన్ బానోతు సునీత వెంకన్న ఆగకుండా అభివృద్ధి సాగాలంటే.. కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వండి! బుచ్చి మునిసిపాలిటీలో తొలి నామినేషన్ దాఖలు మున్సిపల్ సిబ్బంది సేవలు వెలకట్టలేనివి-డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ కిమ్స్ హాస్పిటల్లో ఘనంగా ప్రపంచ అనస్థీషియా దినోత్సవ వేడుకలు వేదగిరిపై విజయలక్ష్మి గా భక్తులను కటాక్షించిన శ్రీ ఆదిలక్ష్మి అమ్మవారు విద్యాలక్ష్మి అలంకారంలో ఆదిలక్ష్మి అమ్మవారు నీరు లేక కరెంటు లేక పంటలు లేక ఇబ్బందులు పడుతున్న రైతులు సరస్వతీ దేవి అలంకారంలో దర్శనమిచ్చిన శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు

ఉదయగిరి జలవనరుల శాఖ డీఈఈ సస్పెన్షన్..

Select Suryaa Now
ఉదయగిరి జలవనరుల శాఖ డీఈఈ సస్పెన్షన్..

ఉదయగిరి,మేజర్ న్యూస్.
కాంట్రాక్టర్ చేసిన పనికి బిల్లు పెట్టడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఉదయగిరి జలవనరుల శాఖ ఇన్చార్జి డీఈఈ మల్లాపు పుల్లయ్యను సస్సెండ్ చేస్తూ జలవనరుల శాఖ ఈఎన్సీ వరప్రసాద్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. వివరాల మేరకు మండలంలోని గండిపాళెం జలాశయం ఎడమ కాలువ కింద వరికుంటపాడు మండలం కొండాయపాళెం 9వ డిస్ట్రిబ్యూటరీ వద్ద గ్రావెల్ పనుల కోసం రూ.5 లక్షల నిధులు 2025 ఆగస్టులో మంజూరయ్యాయి. సాగునీటి సంఘాధ్యక్షుడు ముజే చినలక్ష్మయ్యకు పని మంజూరు కాగా అతను సమీప బంధువు ముజే లక్ష్మీనారాయణ ఇవ్వడంతో ఆయన అక్టోబరులో పని పూర్తి చేశాడు. అప్పట్లో అధికారులు బిల్లులు చేసి డివిజన్ కార్యాలయానికి పంపారు. అయితే సైట్ నిలిపివేయడంతో బిల్లు కాలేదు ఈ ఏడాది సెప్టెంబరులో సైట్ ఓపెన్ కావడంతో బిల్లుల అప్లోడ్ కు అధికారులు చర్యలు చేపట్టారు. ఈఈ, డీఈ, ఏఈుల ఓటీపీల ద్వారా బిల్ అప్లోడ్ చేయాల్సి ఉంది. ఆ సమయంలో డీఈ ఫోన్ స్విచ్ఛాఫ్ అయ్యి ఉండడంతో బిల్లు అప్లోడ్ కాలేదు. అనంతరం ఆయన ఓటీపీ చెప్పడంతో బిల్ అప్లోడ్ చేశారు. అయితే గతనెల 28న పల్లెపండుగ ఏర్పాట్లను పరిశీలించేందుకు రాష్ట్ర జలవనరుల శాఖా మంత్రి నిమ్మల రామానాయుడు వరికుంటపాడు మం డలం రామాపురంకు రావడంతో ఈ విషయాన్ని కాంట్రాక్టర్ ఆయన దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి అగ్రహం వ్యక్తం చేస్తూ సమస్యను పరిష్కరించాలని ఎస్ఈకి సూచించారు. దీం తో ఎస్ఈ డీఈజి మెమో జారీ చేసి వివరణ ఇవ్వాలని ఆదేశించారు. డీఈ ఇచ్చిన వివరణ సరిగా లేకపోవడంతో ఉన్నతాధికారులు అతన్ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు.