తుఫాన్ బియ్యం పంపిణీకి సర్వం సిద్ధం
కె గంగవరం, మేజర్ న్యూస్:మండలంలోని 26 గ్రామాల్లో తుఫాన్ బియ్యం పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తహసీల్దార్ ఐ.జగదీష్ తెలిపారు. మండల పరిధిలోని 20,862 రేషన్ కార్డుదారులకు ఒక్కో కార్డుకు 10 కేజీల చొప్పున బియ్యం పంపిణీ చేయనున్నారు.ఈ మేరకు వీఆర్వోలు,వీఆర్ఏలు గ్రామాల్లోని కార్డుదారులందరికీ బియ్యం సక్రమంగా అందేలా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.ఈ నేపథ్యంలో తహసీల్దార్ జగదీష్ వీఆర్వోలతో ప్రత్యేక సమావేశం నిర్వహించి,పంపిణీ ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆదేశించారు.