తృణ చిరు ధాన్యాలు పండ్లతో మంచి ఆరోగ్యం
కనిగిరి ,మేజర్ న్యూస్ :మండలం లోని టమటంవారిపల్లి అంగన్వాడీ కేంద్రంలో మన అంగన్వాడి -మన బాధ్యత అనే స్ఫూర్తితో9వ జాతీయ పోషణ మాసం అవగాహన కార్యక్రమం ఐ సి డి ఎస్ సూపర్వైజర్ ఎంవి ఎస్. పార్వతి అధ్యక్షతన బుధవారం నిర్వహించారు .ఈ సందర్భంగా పార్వతి మాట్లాడుతూ స్థానికంగా లభించే తృణ ,చిరు ,పప్పు ధాన్యాలు ,పండ్లు, కూరగాయలు ,పాలు ,గుడ్లు,చేపలు ఆహారంలో చేర్చుకోవడం వలన మనకు తగినంత ప్రోటీన్ లభిస్తుందని తెలిపారు .అంగనవాడి కేంద్రాల ద్వారా అందే పోషక పదార్థాలు ,మెనూ చార్ట్, పోషణ వాటికలు, ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన గురించి అవగాహన కలిగించారు.పోషణ మాసం ప్రతిజ్ఞ చేయించి, గ్రామంలో పోషకాహార అవగాహన ర్యాలీ నిర్వహించారు .అనంతరం జరిగిన గురవాజిపేట సెక్టార్ సమావేశంలో పార్వతి మాట్లాడుతూ కార్యకర్తలు అందరూ సమయపాలన పాటించాలని, వారి విధులు, బాధ్యతలను తెలియజేశారు .అనంతరం నెలసరి నివేదికలను పరిశీలించి, పూర్తి చేయించి తీసుకోవడo జరిగింది .ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కేవీ. చంద్రకుమార్ ,అంగన్వాడి కార్యకర్తలు,గర్భవతులు, బాలింతలు, పిల్లలు పాల్గొన్నారు.