ట్రాఫిక్ నిబంధనలు ప్రతి ఒక్కరు పాటించాలి
జంగారెడ్డిగూడెం-మేజర్ న్యూస్జంగారెడ్డిగూడెం పట్టణంలో ట్రాఫిక్ నిబంధనలపై పోలీసులు ప్రత్యేక అవగాహన కార్యక్రమం సీఐ ఎం.వి. సుభాష్, ట్రాఫిక్ ఎస్‌ఐ కుటుంబరావు సిబ్బందితో కలిసి తనిఖీలు చేపట్టారు.ఈ సందర్భంగా హెల్మెట్ ధరించని, నంబర్ ప్లేట్ సరిగా లేని, వాహనాలకు సంబంధించిన ధ్రువపత్రాలు లేని ద్విచక్ర వాహనాలను గుర్తించి వాహనదారులకు నిబంధనలపై అవగాహన కల్పించారు. నంబర్ ప్లేట్ తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.అతి వేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ ప్రమాదాలకు దారితీస్తాయని సీఐ ఎం.వి. సుభాష్ తెలిపారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ తమతో పాటు ఇతరుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. “వేగం వద్దు.. ప్రాణం ముద్దు” అనే నినాదాన్ని గుర్తుంచుకుని సురక్షితంగా ప్రయాణించాలని పోలీసులు సూచించారు.
రిపోర్టర్ కె.వి రమణారావు జంగారెడ్డిగూడెం ఏలూరు జిల్లా