BREAKING
మాజీ మంత్రి బాలినేని ని కలిసిన గర్భం మూవీ హీరోయిన్ లక్షా మార్కాపురంలో ఆధార్ కేంద్రాలపై తహసీల్దార్ కె.చిరంజీవి ఆకస్మిక తనిఖీలు ప్రభుత్వ వైద్యశాలకు ఆరుగురు వైద్యులు నియామకం పల్లె పండుగ లో భాగంగా అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ, జిల్లా కలెక్టర్ గనియ రాజకుమారి కూటమి ప్రభుత్వం పరిపాలనపై ప్రజా అభిప్రాయ సేకరణ.. స్త్రీనిధి రుణాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలి శాంతి భద్రతల పరిరక్షణలో ఉపేక్షించేది లేదు - డిఎస్‌పి కొడకండ్ల ప్రెస్ క్లబ్ కు నూతన కార్యవర్గం ఏకపక్షంగా వ్యవహరిస్తున్న ఎస్సై శ్రీశైలం పై చర్యలు తీసుకోవాలి కోళ్లఫారం ప్రారంభంలో టిడిపి నాయకులు రజక సంఘం నూతన కమిటీ ఎన్నిక ఆత్మకూరులో తెలుగుదేశం యూనిట్ సమావేశం సి జి ఎఫ్ నిధులతో ఆలయాల అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇవ్వాలి-- మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఎన్ఎస్‌యూఐ నాయకులపై దాడి పిరికిపంద చర్య మరిపెడలో ఉచిత నేత్ర వైద్య శిబిరం

మహిళా సంఘాలకు చెక్కులు పంపిణి..

Select Suryaa Now
మహిళా సంఘాలకు చెక్కులు పంపిణి..

పెద్దతిప్పసముద్రం మండలంలోని శ్రీ విజయ గణపతి కళ్యాణ మండపంలో బుధవారం తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ జి.శంకర్ యాదవ్ వెలుగు స్వయం సహాయక సంఘాల మహిళలకు శ్రీనిధి పథకం కింద రూ.30 కోట్ల బ్యాంకు రుణాల చెక్కుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ జి.శంకర్ యాదవ్ మాట్లాడుతూ... మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేందుకు కూటమి ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహకారం ఎంతో కీలకమని, స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలకు ఉపాధి, ఆర్థిక భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మహిళా సంక్షేమం, ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. మహిళల అభివృద్ధితోనే కుటుంబాలు, గ్రామాలు, సమాజం అభివృద్ధి చెందుతాయని అన్నారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, టీడీపీ కుటుంబ సభ్యులు, మహిళా సంఘాల సభ్యులు, అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు.

పాలగిరి గౌరి శంకర్..సూర్య తంబళ్లపల్లె నియోజకవర్గ ఇంచార్జ్