తోపుదుర్తిపై సొంత శ్రేణుల నుంచే విమర్శల వెల్లువ!
తోపుదుర్తిపై సొంత శ్రేణుల నుంచే విమర్శల వెల్లువ!..వైకాపా గుర్తింపు కార్డుల పేరుతో మళ్లీ నాటకాలంటూ ఆరోపణలు.పరిటాల కుటుంబంపై విమర్శలు చేస్తే సహించేది లేదు..మాజీ శాసనసభ్యుడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై తెలుగునాడు విద్యార్థి సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి పరశురామ్ తీవ్ర విమర్శలు చేశారు. గత పాలనలో రాప్తాడు నియోజకవర్గ అభివృద్ధిని విస్మరించారని, రైతులు, మహిళలు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఆరోపించారు. వైకాపా గుర్తింపు కార్డుల పేరుతో మళ్లీ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మ నియోజకవర్గంలో రహదారులు, తాగునీరు, సాగునీటి పనులకు ప్రాధాన్యం ఇస్తున్నారని పరశురామ్ పేర్కొన్నారు. పరిటాల కుటుంబంపై నిరాధార విమర్శలు మానుకోవాలని, లేకపోతే ప్రజలే తగిన సమాధానం చెబుతారని హెచ్చరించారు.