తీరు మార్చుకోకుంటే మీ సంగతి తేలుస్తాం - జగన్ కు, వైసీపీ నాయకులకు మంత్రి సవిత హెచ్చరిక
రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించినా, అభివృద్ధిని అడ్డుకున్నా చూస్తూ ఊరుకోబోమని సరైన సమయంలో మీ సంగతి తేలుస్తామని' జగన్ కు, వైసీపీ నాయకులకు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత హెచ్చరించారు. రాష్ట్రంలో సంక్షేమాన్ని, అభివృద్ధిని జోడు గుర్రాల్లా కూటమి ప్రభుత్వం పరుగులు పెట్టిస్తోందన్నారు. అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసి, సీఎం చంద్రబాబు పేదల కడుపు నింపుతున్నారన్నారు. ఆయన స్ఫూర్తితో గతంలో పెనుకొండలో, ఇప్పుడు గోరంట్ల లో కేంద్రంలో తన సొంత నిధులతో అన్న క్యాంటీన్ ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.