తాగునీటికి ఇబ్బంది లేకుండా చర్యలు.
సూర్య న్యూస్ దర్శి.
ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నట్లు ఆర్డబ్ల్యూఎస్ ఏఈ ఎ .హనుమాన్ బాబు తెలిపారు.దర్శి ముండ్లమూరు స్క్రీమ్ పరిధిలో ఉన్న వర్కర్లు ఏడు నెలల నుంచి జీతాలు రాలేదని విధుల నుంచి బహిష్కరించారు. ఎన్ ఎ పి స్కీం లో ఉన్న రెగ్యులర్ వర్కర్స్ చేత స్కీములు రన్ చేపిస్తూ దర్శి మున్సిపాలిటీ పరిధిలో గాని దర్శి రూరల్ లో గాని ముండ్లమూరు రూరల్ లో గాని ఎటువంటి త్రాగునీటికి సమస్య లేకుండా వాటర్ సప్లై ఎ . ఈ చేస్తున్నారు. ఏమైనా సమస్యలు ఉంటే తాను కచ్చితంగా చేయాలని ఏఈ హనుమాన్ బాబు ప్రజలను కోరారు.