కుంటల అభివృద్ధికి రూ.7.10 లక్షలతో ప్రతిపాదనలు
ఉదయగిరి,మేజర్ న్యూస్ : ఉదయగిరి పట్టణంలోని చౌడ, హుస్సేనుంటల అభివృద్ధికి రూ.7.10 లక్షలతో జిల్లా కలెక్టర్ కు ప్రతిపాదనలు పంపినట్లు జలవనరుల శాఖ డీఈ పుల్లయ్య సోమవారం తెలిపారు. పల్లెపండుగ కార్యక్రమంలో భాగంగా స్థానికులు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు వినతిపత్రం అం దజేశారన్నారు. దీంతో కలెక్టర్ ఆదేశాల మేరకు కుంటల అభివృద్ధికి ప్రతిపాదనలు పంపామని, నిధులు మం జూరు కాగానే అభివృద్ధి పనులు చేపడతామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈ వేణు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.