BREAKING
స్వచ్ఛత, పారిశుద్ధ్య నిర్వహణలో విజయనగరం జిల్లాకు రాష్ట్రస్థాయి గుర్తింపు గాంధీజీకి విఘ్నేశ్వర, అధికారులు నివాళులు ఔత్సాహిక క్రీడాకారులను ప్రోత్సహిస్తాం : పద్మారావు గౌడ్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు బీజేపీ సమర సన్నద్ధం ఎస్.భూర్జవలస హెచ్ఎం కెవి సత్తిబాబుకు స్వచ్ఛత అవార్డు ప్రగతిశీల తల్లిదండ్రుల సంఘం (పి పి ఎల్)జిల్లా అధ్యక్షుడిగా ఉప్పలయ్య* విజయ కాలనీ అంగన్వాడీ కేంద్రానికి స్వచ్ఛ్ ఆంధ్ర అవార్డు చుండూరి నీ స్థాయేంటే....? జాతిపిత గాంధీజీ జయంతి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు విద్యాసంస్థలు వైద్యాలయాలలో చేయరా ? కంచనపల్లి కాంగ్రెస్ గ్రామ శాఖ నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక రామచంద్రపురం సబ్ జైలు తనిఖీ స్వచ్ఛ ఆంధ్రలో కమలాపురం ఆసుపత్రికి ప్రథమ స్థానం డాక్టర్ ఆమంచి శిరీషకు - కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు.. నడకతోనే సంపూర్ణ ఆరోగ్యం… ఎమ్మెల్యే బొలిశెట్టి హార్టికల్చర్ హబ్ ద్వారా రైతులు కు ఎంతో ఉపయోగకరం శిథిలావస్థకు చేరిన సిసి రోడ్లు

స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్‌–2026లో కర్నూలు జిల్లాకు ఐదు రాష్ట్రస్థాయి అవార్డులు*

Select Suryaa Now
స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్‌–2026లో కర్నూలు జిల్లాకు ఐదు రాష్ట్రస్థాయి అవార్డులు*

 

*స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్‌–2026లో కర్నూలు జిల్లాకు ఐదు రాష్ట్రస్థాయి అవార్డులు*

*స్వచ్ఛత, పరిశుభ్రత కార్యక్రమాల అమలుకు రాష్ట్రస్థాయి గుర్తింపు*

*జిల్లా స్థాయిలో 23 విభాగాల్లో 64 అవార్డులు*


*జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి*

కర్నూలు, అక్టోబర్‌ 1: స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణాంధ్ర  అవార్డ్స్‌–2026లో కర్నూలు జిల్లాకు ఐదు రాష్ట్రస్థాయి అవార్డులు దక్కాయని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి ఒక ప్రకటనలో తెలిపారు.  వివిధ విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన సంస్థలు, వ్యక్తులను రాష్ట్రస్థాయి అవార్డులకు ఎంపిక చేశారని,  అక్టోబర్‌ 2న విజయవాడలోని ఏ-కన్వెన్షన్‌ హాల్‌లో నిర్వహించనున్న అవార్డుల ప్రదానోత్సవంలో ఈ పురస్కారాలను ప్రదానం చేయనున్నారని కలెక్టర్ తెలిపారు.

*ఐదు విభాగాల్లో కర్నూలుకు రాష్ట్రస్థాయి పురస్కారాలు*

స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్‌–2026లో స్వచ్ఛ గ్రామ పంచాయతీల విభాగంలో పత్తికొండ గ్రామ పంచాయతీ, స్వచ్ఛ ఆసుపత్రుల విభాగంలో ఆస్పరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC), స్వచ్ఛ రైతు బజార్ల విభాగంలో కర్నూలు సి.క్యాంప్‌ రైతు బజార్ రాష్ట్రస్థాయి అవార్డులకు ఎంపికయ్యాయని, అదేవిధంగా స్వచ్ఛ గ్రామ సంస్థల విభాగంలో కోగిలతోట విలేజ్‌ ఆర్గనైజేషన్‌, బెస్ట్‌ స్వచ్ఛత వారియర్స్‌ విభాగంలో గూడూరు నగర పంచాయతీకి చెందిన ఎం. దుర్గ రాష్ట్రస్థాయి అవార్డులకు ఎంపికయ్యారని కలెక్టర్ తెలిపారు.  జిల్లాకు చెందిన ఐదు విభాగాలు రాష్ట్రస్థాయి స్వచ్ఛ ఆంధ్ర అవార్డులకు ఎంపిక కావడం జిల్లాలో అమలవుతున్న పారిశుధ్య, పరిశుభ్రత కార్యక్రమాలకు లభించిన గుర్తింపుగా నిలిచిందని కలెక్టర్ తెలిపారు.  

*జిల్లా స్థాయిలో 23 విభాగాల్లో 64 అవార్డులు*

జిల్లా స్థాయిలో 23 విభాగాల్లో మొత్తం 64 స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర అవార్డులు ప్రదానం చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు.

23 విభాగాల్లో అవార్డుల వివరాలు

1. స్వచ్ఛ టూరిస్ట్‌ ప్లేసెస్‌ & హెరిటేజ్‌ సైట్స్‌ – 1
  ఓర్వకల్‌ హరిత గార్డెన్‌.

2. స్వచ్ఛ హాస్టల్స్‌ – 3
  సోషల్‌ వెల్ఫేర్‌ కోడుమూరు బాయ్స్‌ హాస్టల్‌, గవర్నమెంట్‌ బీసీ బాయ్స్‌ హాస్టల్‌ వెల్దుర్తి, ట్రైబల్‌ వెల్ఫేర్‌ గర్ల్స్‌ హాస్టల్‌ తుగ్గలి.

3. స్వచ్ఛ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ – 1
  APSWREIS  దిన్నెదేవరపాడు డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ గురుకులం.

4. స్వచ్ఛ పార్కులు & అర్బన్‌ గ్రీన్‌ స్పేసెస్‌ – 1
  ఎమ్మిగనూరు ఎం.ఎస్‌. పార్క్‌.

5. స్వచ్ఛ ఇండస్ట్రీస్‌ (లార్జ్‌/మెగా) – 2
  సూర్య మైసూర్‌ సర్వీస్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌, తుగ్గలి; జైరాజ్‌ లిమిటెడ్‌, ఓర్వకల్‌.

6. స్వచ్ఛ ఇండస్ట్రీస్‌ (ఎంఎస్‌ఎంఈలు) – 2
  కెప్టెన్‌ పాలి ప్లాస్ట్‌ లిమిటెడ్‌, కల్లూరు; యూనివర్సల్‌ హోమ్‌ ప్రొడక్ట్స్‌, కర్నూలు.

7. కమర్షియల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్స్‌ – 1
  విత్‌ ప్రైస్‌ బెస్ట్‌ ప్రైస్‌ ఫ్లిప్‌కార్ట్‌ హోల్‌సేల్‌, కల్లూరు.

8. స్వచ్ఛ పాఠశాలలు – 5
  కల్లూరు ఎంపీపీఎస్‌ ఓబుళాపురం, ఆలూరు కేజీబీవీ, కర్నూలు కేజీబీవీ, కృష్ణగిరి, కర్నూలు ఎంపీపీ ఎస్‌ ఈ. తండ్రపాడు, కల్లూరు ఎంపీపీ ఎస్‌ నెరవాడ.

9. స్వచ్ఛ అంగన్‌వాడీలు – 5
  ఆదోని రాయచోటి రామయ్య లేబర్‌ కాలనీ సెంటర్‌, చిప్పగిరి కేంద్రం, మంత్రాలయం సౌలహళ్లి కేంద్రం, కర్నూలు రూరల్‌ గార్గేయపురం, కర్నూలు అర్బన్‌ జోహారపురం కేంద్రం–4.

10. స్వచ్ఛ ఆసుపత్రులు – 12
   ఆదోని, ఓర్వకల్‌, పత్తికొండ కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు; కర్నూలు జీహెచ్‌డీ, జీఏడీ; పత్తికొండ జీహెచ్‌డీ; నందవరం, పుచ్చకాయలమడ, మద్దికేర ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు; ఎమ్మిగనూరు అర్బన్‌ పీహెచ్‌సీ క్విబులా కాలనీ, కర్నూలు అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ కొత్తపేట, కర్నూలు అర్బన్‌ ఇందిరమ్మ హౌసెస్‌.

11. స్వచ్ఛ బస్‌స్టేషన్లు – 1
   కర్నూలు బస్‌స్టేషన్‌.

12. బెస్ట్‌ స్వచ్ఛత గ్రీన్‌ అంబాసిడర్స్‌ – 5
   గోనెగండ్ల ఎస్‌. మధు, పసుపుల్ల పి. భాస్కర్‌, పసుపుల్ల ఎన్‌. హేమలత, దేవనకొండ ఎం. నరసింహులు, పత్తికొండ డి. లక్ష్మన్న.

13. స్వచ్ఛ కాలనీలు – 1
   సాయి శ్రీ పామ్‌ ట్రీ విల్లాస్‌ అండ్‌ అపార్టుమెంట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌.

14. స్వచ్ఛ ప్రభుత్వ కార్యాలయాలు – 3
   కర్నూలు యూఎల్‌బీ జిల్లా పరిషత్‌ కార్యాలయం, ఎమ్మిగనూరు యూఎల్‌బీ మున్సిపల్‌ కార్యాలయం, ఆదోని యూఎల్‌బీ మున్సిపల్‌ కార్యాలయం.

15. స్వచ్ఛ గ్రామ పంచాయతీలు – 4
   గోనెగండ్ల మండలం గోనెగండ్ల, కర్నూలు రూరల్‌ పసుపుల, మద్దికేర (ఈస్ట్‌) మద్దికేర, పత్తికొండ మండలం దేవనబండ.

16. స్వచ్ఛ మున్సిపాలిటీలు – 1
   ఎమ్మిగనూరు మున్సిపాలిటీ.

17. బెస్ట్‌ స్వచ్ఛత ఎన్‌జీఓలు – 3
   రోటరీ క్లబ్‌ ఆదోని, విజయ మహిళా మండలి ఎమ్మిగనూరు.

18. స్వచ్ఛ కమ్యూనిటీ సోక్‌పిట్స్‌ – 1
   కర్నూలు సుంకేసుల.

19. స్వచ్ఛ ఎస్‌.ఎల్‌.ఎఫ్‌లు – 3
   కర్నూలు గులాబీ మహిళా సమైక్య, కర్నూలు సమత మహిళా ఫెడరేషన్‌, ఆదోని ప్రశాంతి ఎస్‌.ఎల్‌.ఎఫ్‌.

20. స్వచ్ఛ దేవాలయాలు & మత సంస్థలు – 1
   కౌతాళం మండలం ఉరుకుంద గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహ ఈరన్న స్వామి వారి దేవస్థానం.

21. విలేజ్‌ ఆర్గనైజేషన్స్‌ – 4
   చిప్పగిరి మండలం నగరడోనా, గోనెగండ్ల మండలం లింగందిన్నె, కోడుమూరు మండలం కోడుమూరు, పత్తికొండ మండలం దేవనబండ గ్రామాల విలేజ్‌ ఆర్గనైజేషన్లు.

22. బెస్ట్‌ స్వచ్ఛత వారియర్స్‌ (శానిటేషన్‌ వర్కర్స్‌) – 3
   కర్నూలు మండలం ఎస్‌. రాజు, ఆదోని మండలం పి. మహబూబ్‌ సుభాన్‌, ఎమ్మిగనూరు మండలం కె. రంగడు.

23. స్వచ్ఛ రథం – 1
   పెద్దకడబూరు మండలం AP 21 TY 0245.

 

జిల్లాలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో స్వచ్ఛత, పారిశుధ్య కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేస్తూ పరిశుభ్రమైన పరిసరాలు, ఆరోగ్యకరమైన జీవన వాతావరణం కల్పించేందుకు వివిధ శాఖలు, స్థానిక సంస్థలు, పారిశుద్ధ్య సిబ్బంది, స్వయం సహాయక సంఘాలు, ప్రజలు సమన్వయంతో కృషి చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లా స్థాయిలో అవార్డులను అక్టోబర్ 2 వ తేదీన కర్నూలు సునయన ఆడిటోరియంలో అందించనున్నట్లు కలెక్టర్ తెలిపారు.