సుకుమార్ రెడ్డి నాయకత్వంలో జనసేనలోకి చేరికలు.
కావలి మేజర్ న్యూస్ : కావలి మండలంలో జనసేన పార్టీ నాయకుడు మన్నెమాల సుకుమార్ రెడ్డి నాయకత్వం, అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలకు ఆకర్షితులై వైఎస్సార్‌సీపీకి చెందిన సుమారు 160 మంది కార్యకర్తలు జనసేన పార్టీలో చేరారు. ఆనెమడుగు పంచాయతీ మొండిదిన్నిపాలెంకు చెందిన ప్రముఖ యువనేతలు కొనంకి కిషోర్, వెంకటకృష్ణల ఆధ్వర్యంలో పార్టీలోకి వచ్చిన వారికి మన్నెమాల సుకుమార్ రెడ్డి జనసేన కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జనసేన సిద్ధాంతాలు, ప్రజా సంక్షేమ దృక్పథమే ధ్యేయంగా పనిచేస్తున్నామని, కావలి నియోజకవర్గంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు.