BREAKING
శ్రీ పద్మాక్షి దేవాలయ శరన్నవరాత్రి ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ సోనాక్షి సిన్హా, జహీర్ ఇక్బాల్ దంపతుల కొత్త సినిమా 'తూ హై మేరీ కిరణ్' ట్రైలర్ విడుదల! జాతీయ అవార్డు గ్రహీత చంద్రకళకు పోలీస్ శాఖ సత్కారం గ్రామీణ ప్రజలకు వైద్యం మరింత చేరువ: ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ఎస్పీ బాలుతో ఆ జ్ఞాపకం ఇప్పటికీ మరువలేను.. ఎస్వీ కృష్ణా రెడ్డి ఎమోషనల్ పోస్ట్! చెత్తను సద్వినియోగం చేసుకోవాలి ఆశావర్కర్స్కు కనీసవేతనాలు చెల్లించాలి. అయోడిన్ లోప రుగ్మతల నియంత్రణకు జిల్లా స్థాయి సర్వే.. ఎముకల ఆరోగ్యం: వయసు పెరుగుతున్న కొద్దీ ఎముకలు దృఢంగా ఉండాలంటే రోజూ ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ప్రొటీన్ లోపం రాకుండా ఉండాలంటే రోజువారీ మన శరీరానికి ఎంత ప్రొటీన్ అవసరమో తెలుసా? ఐరన్ లోపం: శరీరంలో హిమోగ్లోబిన్ తగ్గి అలసట, తల తిరగడానికి అసలు కారణం ఏమిటో తెలుసా? కరీనా షోలో షాహిద్ కపూర్ భార్య మీరా రాజ్‌‌పుత్.. ఆ యాడ్ వివాదంపై కృతి సనన్ షాకింగ్ కామెంట్స్! లక్ష్మీపోలవరంలో అంగన్వాడీ ఉత్సవ్ ప్రజలకు శుభ్రమైన తాగునీరు అందేలా చర్యలు విదేశాలకు వెళ్లే ముందు పూర్తి సమాచారాన్ని తెలుసుకోవాలి.. జిల్లా కలెక్టర్ డా. మహేష్ కుమార్

స్థానిక సంస్థ లోబిసి లకు 34% రిజర్వేషన్లకుటిడిపి కట్టుబడి ఉంది

Select Suryaa Now
స్థానిక సంస్థ లోబిసి లకు 34% రిజర్వేషన్లకుటిడిపి కట్టుబడి ఉంది

పాలకొండ:  ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లకు తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందని తెలుగుదేశం పార్టీ బాద్యులు పడాల భూదేవి అన్నారు. సోమవారం ఆమె టిడిపి పార్టీ కార్యాలయం లో విలేకరుల సమావేశం నిర్వహించారు. బడుగు బలహీనవర్గాలకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతో అసెంబ్లీలో బీసీలకు 34% రిజర్వేషన్ ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని జీవో నెం.105, 1065 జారీ చేస్తే వైసీపీ నేతలు కోర్టుకు వెళ్లి అడ్డుకున్నారన్నారు. ఎన్నికలు జరగకూడదు, బీసీలకు రిజర్వేషన్ దక్కకూడదనే కుట్రతో గొడ్డలి పార్టీ నేతలు అడ్డుకున్నారు. బీసీలకు న్యాయం జరిగేలా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం అన్నారు. న్యాయపరంగా ఉన్న ప్రతి అవకాశాన్ని ఉపయోగించి బీసీలకు న్యాయం జరిగేలా చూస్తాం. వైసీపీ హయాంలో 34% రిజర్వేషన్లను కోర్టు కొట్టివేస్తే సుప్రీంకోర్టుకు వెళ్లకుండా బీసీలకు చారిత్రాత్మక ద్రోహం చేశారు. స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్లు కల్పించాలన్న మా సంకల్పం మారదు. బీసీలకు న్యాయం జరిగే వరకు కృషి చేస్తాం. 34% రిజర్వేషన్లతోనే సామాజిక న్యాయం సాధ్యమవుతుందన్నారు. బీసీలకు 34% రిజర్వేషన్లు ఇస్తే రాజకీయ ప్రాతినిధ్యం పెరుగుతుందనే కుట్రతో గొడ్డలి పార్టీ నేతలు న్యాయస్థానంలో పిటిషన్లు వేసి బీసీలకు తీరని ద్రోహం చేశారు. వైసీపీ హయాంలో స్థానిక సంస్థల్లో బీసీలకు 34% ఇవ్వకపోవడం వల్ల 16,800 మంది పదవులు కోల్పోయారు. ఇప్పుడు కూడా పదవులు రాకూడదన్న కుట్రతో కోర్టుకు వెళ్లి నిస్సిగ్గుగా అడ్డుకున్నారు.> అన్ని వర్గాల హక్కులను కాపాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో 34% రిజర్వేషన్లను బీసీలకు పునరుద్ధరించేందుకు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడుగారు అహర్నిశలు కృషి చేస్తుంటే గొడ్డలి పార్టీ నేతలు మాత్రం కుట్రలు చేస్తున్నారన్నారు. బీసీలకు అవకాశాలు, రాజకీయ ప్రాతినిధ్యం లేకుండా చేయాలనే అజెండాతో గొడ్డలి పార్టీ నేతలు పనిచేస్తున్నారు. వెనుకబడిన వర్గాలను ఓటు బ్యాంకులా చూడాలనే కుట్రతో గొడ్డలి పార్టీ నేతలు ఇటువంటి నీచ రాజకీయాలు చేస్తున్నారు. బీసీలను రాజ్యాధికారంలో భాగస్వాములు చేసేందుకు తెలుగుదేశం పార్టీ కృషి చేస్తుంది. సమాజంలో సగానికి పైగా ఉన్న బీసీల అభ్యున్నతి కోసం మేం ఇచ్చిన మాటపై ఎక్కడా వెనక్కి తగ్గం. హైకోర్టు తీర్పును గౌరవిస్తూ బీసీలకు న్యాయం జరిగేలా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం. ఇది కేవలం రిజర్వేషన్ల అంశం మాత్రమే కాదు.. బీసీలకు దక్కాల్సిన రాజకీయ ప్రాతినిధ్యం. నాలుగు దశాబ్దాల క్రితమే బీసీలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించి 1987లో 20%, 1995లో 34% రిజర్వేషన్లు కల్పించాం. బీసీలకు రాజకీయ సాధికారత అనేది టీడీపీ డీయన్ఏ లోనే ఉందన్నారు. ఈ కార్యక్రమం లో మండల టిడిపి పార్టీ అధ్యక్షులు గండి రామినాయుడు, మజ్జి జయ శంకర్,మహేష్ తదితరులు పాల్గొన్నారు.