andhrapradesh
స్థానిక ఎన్నికల్లో జనసేన, కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యం-ఎమ్మెల్యే మండలి
అవనిగడ్డ, మేజర్ న్యూస్: స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని జనసేన, కూటమి అభ్యర్థుల గెలుపునకు సమష్టిగా కృషి చేయాలని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్వహించిన జనసేన నియోజకవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పొత్తు ధర్మాన్ని పాటిస్తూ జనసేనకు కేటాయించిన ప్రతి స్థానంలో విజయం సాధించేలా పనిచేయాలన్నారు. ఎంపీపీ, జడ్పీటీసీ పదవులకు ఏ పార్టీ అభ్యర్థులు పోటీ చేయాలనే విషయాన్ని కూటమి అధినేతలు నిర్ణయిస్తారని తెలిపారు. పార్టీ అధిష్టానం ప్రకటించిన అభ్యర్థుల గెలుపునకు నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని సూచించారు. అనంతరం మండలాల వారీగా నాయకులతో సమీక్ష నిర్వహించారు.
సమావేశంలో పీసీ చైర్మన్ దేవనబోయిన వెంకటేశ్వరరావు, ఏఎంసీ చైర్మన్ తోట కనకదుర్గ, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు మత్తి వెంకటేశ్వరరావు, జిల్లా అధికార ప్రతినిధి రాయపూడి వేణుగోపాల్, సీనియర్ నాయకులు చెన్నగిరి సత్యనారాయణ, మండల అధ్యక్షులు గుడివాక శేషుబాబు, మర్రె గంగయ్య, పూషడపు రత్నగోపాల్, జిల్లా కార్యదర్శులు కొండవీటి సునీత, గాజుల శంకరరావు తదితరులు పాల్గొన్నారు.✍️ అజంతా శ్రీనివాస్, అవనిగడ్డ, కృష్ణాజిల్లా.