"సోమిరెడ్డి' చేసింది శూన్యం..!
"సోమిరెడ్డి' చేసింది శూన్యం..!
-మాజీ మంత్రి "కాకాణి"..!!
(తోటపల్లిగూడూరు, మేజర్ న్యూస్)
సర్వేపల్లి నియోజకవర్గం అభివృ ద్ధి కోసం ఎమ్మెల్యే సోమిరెడ్డి చం ద్రమోహన్ రెడ్డి చేసిందేమి లేదని మాజీ మంత్రి డాక్టర్ కాకాణి గోవ ర్ధన్ రెడ్డి విమర్శించారు. ఎన్నికల ను పురస్కరించుకొని శుక్రవారం ఆయన తోటపల్లి గూడూరు మం డలం, వరిగొండ గ్రామ పంచాయ తీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కా ర్యాలయం ప్రారంభించి, ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. స ర్పంచ్ అభ్యర్థి గూడూరు విష్ణు మోహన్ రెడ్డితో పాటు వార్డు స భ్యుల అభ్యర్థులను ,అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆ యన కోరారు. ఈ సందర్బంగా కాకాణి సోమిరెడ్డిపై విమర్శలు సంధించారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను, టీడీపీ నాయకుల రాజకీయ దిగజారుడుతనాన్ని గోవర్ధన్ రెడ్డి ఎండగట్టారు. చం ద్రబాబు హామీలన్నీ బూటకమే.. సోమిరెడ్డి రాజకీయాలు పదవుల కోసం బ్రతిమిలాడటమేనని ఎద్దే వా చేశారు. ప్రజలకు ఏం చేశారో చెప్పే దమ్ములేక, రాజీల పేరుతో సోమిరెడ్డి బ్రతిమిలాడుతున్నార న్నారు. సోమిరెడ్డి వల్ల అన్యా యం జరిగిందని సాక్షాత్తు టీడీపీ నాయకులే వాపోతున్నారని ఆ యన విమర్శించారు. సర్వేపల్లి లో ఇసుక, మట్టి, గ్రావెల్, బూడి ద, విచ్చలవిడిగా దోచుకోవడం సోమిరెడ్డి తప్ప, ఏమి అభివృద్ధి చేశారో చెప్పాలని కాకాణి డి మాండ్ చేశారు. సోమిరెడ్డి బుద్ధి మంతుడు లాగా, నీతులు వల్లి స్తున్నారని, పంచాయతీ ఎన్నిక ల్లో సోమిరెడ్డికి సర్వేపల్లి ఓటర్లు గట్టిగా బుద్ధి చెప్పాలని తెలిపా రు. ప్రజలకు నీతులు చెప్పే ముం దు గత రెండున్నర సంవత్సరా లుగా తాను అధికారంలో ఉండి ఏం చేశాడో సోమిరెడ్డి ఆత్మపరిశీ లన చేసుకోవాలని గోవర్ధన్ రెడ్డి హితవు పలికారు. పంచాయతీ సోమిరెడ్డి మాటలకు, మాయ మాటలకు మోసపోకుండా సర్వే పల్లి ఓటర్లు తమ ఓటు ద్వారా గట్టిగా బుద్ధి చెప్పాలని కాకాణి పిలుపునిచ్చారు. ఈ కార్యక్ర మంలో సర్పంచ్ అభ్యర్థి గూడూ రు విష్ణుమోహన్ రెడ్డి, నెల్లిపూడి సునీల్ కుమార్ రెడ్డి, కామిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, చిల్లకూరు ప్రవీ ణ్ కుమార్ రెడ్డి, గండవరపు శ్యా మలమ్మ, శ్యాం సుందర్ రెడ్డి, స్థా నిక నాయకులు, కార్యకర్తలు పా ల్గొన్నారు.