సంగంలో 24వ రోజుకు చేరిన వీఆర్ఏల ధర్నా...
సంగం మేజర్ న్యూస్ : సంగం తహసీల్దార్ కార్యాలయం వద్ద వీఆర్ఏలు చేపట్టిన నిరసన కార్యక్రమం శుక్రవారం 24వ రోజుకు చేరుకుంది. తమ న్యాయమైన సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వీఆర్ఏలు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వీఆర్ఏలు చేతులకు తాళ్లు కట్టుకుని సంకెళ్ల తరహాలో నిరసన ప్రదర్శన చేపట్టారు. 24 రోజులుగా ఆందోళన చేస్తున్నప్పటికీ ప్రభుత్వం తమ సమస్యలను పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఇప్పటికే పలుమార్లు అధికారులకు వినతిపత్రాలు సమర్పించినా స్పందన లేకపోవడంతో ఆందోళన కొనసాగిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని వీఆర్ఏలు విజ్ఞప్తి చేశారు.