SIR ప్రక్రియను రద్దు చేయాలి ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్
అనంతపురం బ్యూరో : ప్రజాస్వామ్య పరిరక్షణ, ఓటు హక్కు రక్షణ, అర్హులైన ప్రతి పౌరుడి పేరు ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఐక్య విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో అనంతపురంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ SIR ప్రక్రియపై ఓటర్లలో ఆందోళనలు ఉన్నాయని, అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించకుండా పూర్తి పారదర్శకతతో ప్రక్రియ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ప్రతి ఓటరు తన పేరు జాబితాలో ఉందో లేదో తెలుసుకునే అవకాశం కల్పించాలని కోరారు.
ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో విశ్వాసం పెంపొందించేలా ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, ఈ నేపథ్యంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. SIR ప్రక్రియను రద్దు చేసి ఓటర్ల హక్కులను పరిరక్షించాలని కోరారు.
ఈ సమావేశంలో SFI, AISF, PDSU, YSRSSU, AISA, DYFI, AIYF, NSUI, PSU, AIFDS, AISB, USF, AISP తదితర సంఘాల నాయకులు పాల్గొన్నారు.
రిపోర్టర్ : మొయినుద్దీన్, అనంతపురం బ్యూరో, అనంతపురం.